Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: హే కేన్.. నీ సబ్బు స్లోనా? టైటిల్ పోజ్‌పై పేలుతున్న జోకులు, సెటైర్లు!

WTC Final: Netizens compare Virat Kohli and Kane Williamson’s picture with Test mace to detergent ads

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఇచ్చిన టైటిల్ ఫోజ్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. ఈ ఫొటోలో ఇరు జట్ల కెప్టెన్‌లు చెరొపక్క నిలబడగా.. మధ్యలో డబ్ల్యూటీసీ టైటిల్ గదను ఉంచారు. అయితే ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ దుస్తులు తెల్లగా మెరిసిపోతుంటే.. కేన్ విలియమ్సన్ డ్రెస్ మాత్రం మాసిపోయినట్లు ఉంది. దీన్నే టార్గెట్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఓ డిటెర్జంట్ యాడ్‌గా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

డిటర్జెంట్ సబ్బులు, సర్ఫులకు ఉపయోగించే యాడ్ డైలాగ్స్‌ను ఈ ఫొటోలకు క్యాప్షన్‌‌గా పేర్కొంటూ ఫన్నీమీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 'హే కేన్ నీ సబ్బు స్లోనా? అని ఒకరంటే.. న్యూజిలాండ్‌లో టైడ్ సబ్బు లేదా?'అని మరొకరు ప్రశ్నించారు. 'ఇదైతే డిటర్జెంట్ యాడ్ కాదు కదా? అసలు కోహ్లీ ఏ డిటర్జెంట్ పౌడర్ వాడుతున్నాడో? అతని బట్టలు తెల్లగా మెరిసిపోతున్నాయి'అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇంకొకరేమో టైడ్ యాడ్‌లా ఉందని, న్యూజిలాండ్ ప్లేయర్లకు టైడ్, సర్ఫక్సెల్, ఏరియల్, ఘడీ డిటర్జంట్ ఫౌడర్లు ఇవ్వాలని సెటైర్లు పేల్చుతున్నారు. న్యూజిలాండ్‌లో టైడ్ దొరకదా? ఏందని మరొకరు ప్రశ్నించారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన 46 ఓవర్లలో 3 వికెట్లకు 95 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(20 బ్యాటింగ్), అజింక్యా రహానే(4 బ్యాటింగ్) ఉన్నారు. నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(34), శుభ్‌మన్ గిల్(28) 62 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. సెషన్ మొత్తం నిలవలేకపోయారు. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో రోహిత్, నీల్ వాగ్నర్ ఓవర్‌లో గిల్ ఔటయ్యారు. దాంతో భారత్ 69/2తో లంచ్ విరామానికి వెళ్లింది. సెకండ్ సెషన్‌లో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన పుజారా.. ట్రెంట్ బౌల్ట్ సూపర్ ఇన్ స్వింగర్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. 54 బంతులు ఆడిన పుజారా.. బౌల్ట్ వేసిన ఆ బంతిని మాత్రం అంచానా వేయలేకపోయాడు.

Story first published: Sunday, June 20, 2021, 20:25 [IST]
Other articles published on Jun 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+