For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: 'రికార్డులను పరిశీలిస్తే.. కివీస్ కంటే మా బౌలింగే ఉన్నతమైనది'

WTC Final: Mohammed Shami feels Indian pace trio is better than New Zealand
WTC Final : Mohammed Shami Believes Indian Pacers Are Better Than New Zealand’s || Oneindia Telugu

ముంబై: రికార్డులను పరిశీలిస్తే.. న్యూజిలాండ్ కంటే టీమిండియా బౌలింగే ఉన్నతమైనది అని భారత సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ అన్నాడు. టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్ త్రయం ఏర్పడడానికి ఎంతో కష్టపడ్డాం అని తెలిపాడు. జట్టును ఒక యూనిట్‌గా ముందుకు తీసుకెళ్తాం అని షమీ చెప్పాడు. జూన్‌ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్‌, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ ఫైనల్‌ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో సత్తా చాటడానికి భారత పేస్‌ దళం సమయాత్తమవుతోంది.

తాజాగా మహ్మద్‌ షమీ స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ... 'మేం టెస్టు క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏ బౌలరైనా విఫలమైనప్పుడు మిగతా బౌలర్లు పుంజుకుంటారు. ఆ సహచరుడు మంచిగా బౌలింగ్ చేసేందుకు సలహాలు, సూచనలిస్తూ ప్రోత్సాహిస్తాం. గాడిలో పడేవరకు అండగా నిలుస్తాం. జట్టును ఒక యూనిట్‌గా ముందుకు తీసుకెళ్తాం. న్యూజిలాండ్ ఫాస్ట్‌ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్‌, టిమ్‌ సౌథి, నీల్ వాగ్నర్‌ కంటే.. మా బౌలింగ్ దళం ఉన్నతమైనది' అని అన్నాడు.

'రికార్డులను పరిశీలిస్తే మా బౌలింగ్ దళం ఉన్నతమైనది మీకు స్పష్టతవస్తుంది. రాత్రికి రాత్రే అభిమానులు పుట్టుకురారు. వాళ్లకు చరిత్ర అంతా తెలుసు. నా ఫాస్ట్‌ బౌలింగ్ త్రయం (మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ) ఏర్పడటానికి ఎంతో కష్టపడ్డాం. యువ ఆటగాళ్లు కూడా జట్టులోకి వస్తున్నారు. వారు బాగా రాణిస్తున్నారు. ఇది జట్టుకు శుభసూచికం. ఇప్పుడు మా రిజర్వ్ బెంచ్ కూడా ఎంతో పటిష్టంగా ఉంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు' అని మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం నెలరోజుల పాటు ఇంగ్లండ్ గడ్డపైనే ఉండి కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది. బుధవారం ముంబైకి చేరుకున్న టీమిండియా అక్కడ బీసీసీఐ ఏర్పాటు చేసిన కఠిన నిబంధనల మధ్య ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండనుంది. ముంబై నుంచి జూన్ 2న ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కి భారత ప్లేయర్స్ బయలుదేరనున్నారు. ఇదే విమానంలో భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్ సిరీస్ కోసం అక్కడికి వెళ్లనున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, May 20, 2021, 18:55 [IST]
Other articles published on May 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+