Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final:'భారత బౌలింగ్‌ దాడి ఎంతో బలంగా ఉంది..ఫైనల్ పోటీ పెద్ద సవాల్!కోహ్లీతో టాస్‌కు రావడం ఆనందం'

WTC Final: Kane Williamson says Team India have a fantastic bowling unit
Newzealand Captain kane Williamson praises Teamindia bowling unit | Oneindia Telugu

సౌథాంప్టన్‌: ప్రస్తుతం భారత బౌలింగ్‌ దాడి ఎంతో బలంగా ఉందని, టీమిండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)​ ఫైనల్ పోటీ కఠినంగా ఉంటుందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. భారత సారథి విరాట్‌ కోహ్లీతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్‌ టాస్‌కు రావడం సంతోషంగా ఉంటుందన్నాడు. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరు కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని విలియమ్సన్‌ వెల్లడించాడు. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 కోహ్లీతో టాస్‌కు రావడం ఆనందం:

కోహ్లీతో టాస్‌కు రావడం ఆనందం:

తాజాగా ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డబ్ల్యూటీసీ ఫైనల్‌, భారత బౌలింగ్ విభాగంపై కేన్‌ విలియమ్సన్‌ స్పందించాడు. 'విరాట్ కోహ్లీతో కలిసి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ టాస్‌కు రావడం చాలా బాగుంటుంది. టీమిండియా పటిష్ట జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. కోహ్లీసేనతో పోటీ కఠినంగానే ఉంటుంది. కొన్నేళ్లుగా మా రెండు జట్లు వేర్వేరు ఫార్మాట్లలో తలపడ్డాయి. ఎవరెలా ఆడతారో పరస్పరం అవగాహన ఉంది. అందుకే టాస్‌కు రావడం, కోహ్లీచాలా తో మాట్లాడటం, ఫైనల్లో పోటీ పడటం బాగుంటుంది' అని విలియమ్సన్‌ అన్నాడు.

ఆస్ట్రేలియాలో ఏం చేశారో చూశాం:

ఆస్ట్రేలియాలో ఏం చేశారో చూశాం:

టీమిండియా బౌలింగ్‌ దాడి పటిష్ఠంగా ఉందని కివీస్ సారథి కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసించాడు. 'టీమిండియా బౌలింగ్ విభాగం దుర్భేద్యంగా ఉంది. వారి బౌలింగ్ దాడిపై మాకు అవగాహన ఉంది. ఆస్ట్రేలియాలో వాళ్లేం చేశారో మేం చూశాం. కోహ్లీసేన పేస్‌, స్పిన్‌ విభాగాలు అత్యంత పటిష్ఠంగా ఉన్నాయి. వారి బౌలింగ్‌ ఇప్పుడు అగ్రస్థానంలో ఉందనడంలో సందేహం లేదు. అందుకే అత్యుత్తమ జట్టుతో ఫైనల్‌ ఆడుతుండటం మాలో ఉత్సాహాన్ని, ఆసక్తినీ పెంచుతున్నాయి. పోటీ రసవత్తరంగా ఉంటుంది. విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం' అని కేన్ తెలిపాడు.

 అండర్-19 ఆడే రోజుల నుంచే:

అండర్-19 ఆడే రోజుల నుంచే:

2008లో అండర్-19 ఆడే రోజుల నుంచి విరాట్ కోహ్లీ-కేన్ విలియమ్సన్‌ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మైదానంలోనే కాకుండా బయటా కూడా సన్నిహితంగా ఉంటారు. అంతేకాదు ఇద్దరూ ఒకర్నొకరు గౌరవించుకుంటారు. అయితే కెప్టెన్సీలో ఇద్దరిది భిన్నమైన శైలి. విలియమ్సన్‌ ఓపికతో ఉంటూ నిర్ణీత సమయంలో ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రత్యర్థిపై నిరంతరం ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా విలియమ్సన్‌ కామ్‌గా తనపని తాను చేసుకుంటూ పోతే.. విరాట్ దూకుడుగా ఆడుతాడు.

 పటిష్ఠంగా భారత బౌలింగ్‌ దళం:

పటిష్ఠంగా భారత బౌలింగ్‌ దళం:

ఇక జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్, మొహ్మద్ సిరాజ్‌, ఆర్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌తో కూడిన భారత బౌలింగ్‌ దళం అత్యంత పటిష్ఠంగా ఉంది. పిచ్ పరిస్థితులను బట్టి పేస్, స్పిన్నర్లు బాధ్యతలు తీసుకుంటారు. జట్టులోని ప్రతి బౌలర్ మ్యాచ్ విన్నరే. మరోవైపు కివీస్‌ బౌలింగ్‌ సైతం దూకుడుగానే ఉంది. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ, కైల్ జేమిన్సన్, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్ లాంటి వారు ఉన్నారు.

Story first published: Tuesday, June 8, 2021, 8:19 [IST]
Other articles published on Jun 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+