Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final: గిట్లయితే ఎట్ల కేన్ మామ: జర మంచిగ ఆడరాదె

 WTC final: Kane Williamson’s last 10 scores in Tests as 210 runs

లండన్: ఇంకొద్దిరోజుల్లో ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ ఆరంభం కాబోతోంది. లండన్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ దిశగా మరో కీలక ఘట్టానికి తెర లేచింది. ఈ మ్యాచ్‌లో బలమైన భారత క్రికెట్ జట్టుతో తలపడనున్నారు బ్లాక్ క్యాప్స్. దీనికి సన్నాహకంగా అన్నట్టు న్యూజిలాండ్ జట్టు- ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచులను ఆడుతోంది. తొలి టెస్ట్ ఆరంభమైంది కూడా. క్రికెట్ మక్కా లండన్‌లోని లార్డ్స్‌లో తొలి టెస్ట్ సాగుతోంది. తన తొలి ఇన్నింగ్‌లో 378 పరుగులు చేసింది టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ టీమ్.

పేలవంగా బ్యాటింగ్..

పేలవంగా బ్యాటింగ్..

స్కోర్ బోర్డు మీద 378 పరుగుల భారీ కనిపిస్తోన్నప్పటికీ.. అందులో ఓపెనర్ ప్లస్ డెబ్యూ బ్యాట్స్‌మెన్ చేసిన స్కోరే అధికం. జట్టు మొత్తం చేసిన పరుగుల్లో 50 శాతానికి పైగా అతనొక్కడే బాదాడు.. ఈ క్రమంలో డబుల్ సెంచరీ చేశాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే 200 మార్క్ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లలో ఎవ్వరూ రాణించలేదు.. మిడిలార్డర్‌లో హెన్రీ నికోల్స్ ఒక్కడే 61 పరుగులు చేశాడు. అయిదు మంది బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్ దాటక పోవడం జట్టును ఆందోళనలోకి నెట్టినట్టయింది.

 కేన్ కూడా..

కేన్ కూడా..

తొలి ఇన్నింగ్‌లో కేప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా రాణించలేకపోయాడు. 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు కేన్ మామ. అండర్సన్‌ చేతుల్లో కేన్ విలియమ్సన్ అవుట్ కావడం టెస్టుల్లో ఇది ఏడోసారి. అండర్సన్ ఆఫ్ సైడ్ సంధించిన బంతిని ఆడబోయిన కేన్.. దాన్ని వికెట్ల మీదికి తెచ్చుకున్నాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్లను గిరాటేసింది. టెస్టుల్లో మరోసారి విలియమ్సన్ విఫలమయ్యాడు.

చివరి పది ఇన్నింగుల్లో

చివరి పది ఇన్నింగుల్లో

కేన్ విలియమ్సన్ చివరి10 ఇన్నింగుల్లో చేసిన స్కోర్ 210 మాత్రమే. 13,0,9,14,34,27,8,25,75,5.. ఇదీ కేన్ బ్యాటింగ్ తీరు. బ్యాటింగ్ యావరేజ్ 21. ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచుల్లో కుదురుకుంటాడనుకుంటే.. మరోసారి విఫలం అయ్యాడు. ఇది కాస్తా బ్లాక్ క్యాప్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. జో రూట్ సారథ్యంలోని ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన వెంటనే కివీస్ టీమ్.. భారత జట్టుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆడాల్సి ఉంది.

 కోహ్లీ సేన.. పని సులువేనా?

కోహ్లీ సేన.. పని సులువేనా?

ప్రతిష్ఠాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ ముందు.. అతను విఫలమౌతోండటం జట్టులో ఆందోళనను నింపుతోంది. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి తలవంచడాన్ని బట్టి చూస్తోంటే.. కోహ్లీసేన పెద్దగా కష్టపడాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్, రెండో టెస్ట్ మ్యాచ్‌.. ఇక ఆ జట్టు భవితవ్యాన్ని తేల్చాల్సి ఉంది. ఈ రెండింట్లో కివీస్ జట్టు పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. అటు బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదనిపించుకుంటోంది కివీస్. తొలి రెండు వికెట్లను త్వరగానే పడగొట్టింది.

Story first published: Friday, June 4, 2021, 11:02 [IST]
Other articles published on Jun 4, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+