Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు గట్టి షాక్.. గాయం తిరగబెట్టి స్టార్ పేసర్ దూరం!

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా టీం చాలా కష్టపడింది. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. ఈ వార్త విన్న అభిమానులు కూడా ఆశ్చర్య పోతున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్ ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్
కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 15 మంది బృందంలో చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఐపీఎల్‌లో కూడా హాజిల్‌వుడ్ పెద్దగా ఆకట్టుకోని సంగతి తెలిసింది.

WTC Final JOsh Hazzlewood ruled out of final due to injury

ఆసీస్ జట్టు బౌలింగ్ భారాన్ని స్టార్క్‌తో కలిసి మోస్తున్న హాజిల్‌వుడ్ కొంత కాలం క్రితం గాయపడ్డాడు. ఈ క్రమంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు కూడా అతను ఎంపిక కాలేదు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ కూడా ఆడలేదు. అయితే అనంతరం జరిగిన ఐపీఎల్ సగం ముగిసిన తర్వాత ఆర్సీబీతో చేరాడీ ఆసీస్ స్టార్. కానీ ఇక్కడ కూడా పెద్దగా రాణించలేకపోయాడు.

ఈ నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అతను ఆసీస్‌కు చాలా కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో అదే గాయం తిరగబెట్టడంతో హాజిల్‌వుడ్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా బృందంలో మళ్లీ మార్పు చేయాల్సి వచ్చిందని సమాచారం. అతని విషయంలో అంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించిందట.

ఆసీస్ బృందం: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారీస్, ట్రావిసె హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నెజర్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

Story first published: Sunday, June 4, 2023, 19:25 [IST]
Other articles published on Jun 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+