Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final: గెలిచేదెవరో తేల్చేసిన మెక్‌కల్లమ్: కారణాలు కూడా

WTC Final: Its New Zealands favour against India as 60-40, says Brendon McCullum
WTC Finals Playing Conditions చిన్న మెలిక | Grade 1 Dukes Balls | Reserve Day || Oneindia Telugu

అక్లాండ్: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నమ్యాచ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్. ఈ మ్యాచ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఫీవర్ మొదలవుతోంది. టెస్ట్ మ్యాచే అయినప్పటికీ- డబ్ల్యూటీసీ ఫైనల్ కావడం, భారత్ ఆడబోతోండటం ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ సీజన్లతో భారత్‌లో లక్షలాదిమంది అభిమానులు సంపాదించుకున్న కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్- ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఢీ కొట్టబోతోండటం మరింత రసవత్తరంగా మార్చివేసింది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ టీమ్.. ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నప్పటికీ.. దాన్నెవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు.

 ఫైనల్‌పై డిబేట్స్ షురూ..

ఫైనల్‌పై డిబేట్స్ షురూ..

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌లను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా కోహ్లీసేన ఈ ఫైనల్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత పొందింది. ఈ నెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ చారిత్రాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విన్నర్ ఎవరనే విషయంపై డిబేట్లు కూడా మొదలయ్యాయి. తొలి ఛాంపియన్‌గా ఎవరు ఆవిర్భవిస్తారనే విషయంపై ప్రిడిక్షన్స్ ఆరంభమయ్యాయి.

 కివీస్‌కే ఛాన్సెస్

కివీస్‌కే ఛాన్సెస్

ఈ మ్యాచ్‌లో కివీస్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని న్యూజిలాండ్‌ మాజీ కేప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అంచనా వేశాడు. గెలుపు కోసం హోరాహోరి పోరు తప్పదని చెప్పాడు. మ్యాచ్ చివరి రోజు వరకూ సాగుతుందని, ఉత్కంఠభరితంగా ఉంటుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్-భారత్ మధ్య 60-40 అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. కివీస్ టైటిల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి 60 శాతం ఛాన్సులు ఉన్నాయని చెప్పాడు. ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్‌లపై అవగాహన, ప్లేయర్ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుని తాను ఈ అంచనాకు వచ్చినట్లు వివరించాడు.

ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ రెండు టెస్టులు..

ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ రెండు టెస్టులు..

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోండటం కూడా కలిసి వస్తుందని మెక్‌కల్లమ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో లోటుపాట్లను సవరించుకోవడానికి, ఇంగ్లాండ్ వాతావరణానికి అలవాటు పడటానికి ఈ రెండు మ్యాచ్‌లు ఉపకరిస్తాయని చెప్పాడు. బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు గాడిలో పడటానికి ఈ రెండు మ్యాచ్‌లు సహకరిస్తాయని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే.. ఈ రెండు టెస్టుల ద్వారా అవి సాధ్యపడతాయని చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ బుధవారం ఆరంభమౌతుంది.

 టీమిండియా ప్రయాణం రేపే..

టీమిండియా ప్రయాణం రేపే..

డబ్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు బుధవారమే ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్తుంది. ఇవ్వాళ్టితో టీమిండియా క్రికెటర్ల క్వారంటైన్ కాలం ముగుస్తుంది. ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టిన తరువాత మరో మూడురోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అలాగే- ప్రతి ఆటగాడు కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అక్కడి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తరువాత.. టీమిండియా ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది. తొలి టెస్ట్ ఆగస్టు 4న ఆరంభమౌతుంది.

Story first published: Tuesday, June 1, 2021, 8:28 [IST]
Other articles published on Jun 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+