WTC Final: ఇంగ్లండ్ పర్యటనకు సకుటుంబ సమేతంగా కోహ్లీ సేన!

ముంబై: కరోనా దెబ్బకు ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. టీమిండియా తదుపరి పర్యటనపై దృష్టి పెట్టింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా టీమ్ మొత్తాన్ని 18 రోజుల హార్డ్ క్వారంటైన్‌లో ఉంచనుంది.

ఇండియాతో మొదలుకుని యూకే వరకు ఈ క్వారంటైన్ కొనసాగనుంది. మొత్తానికి మూడు నెలల పాటు లండన్‌లో ఉన్న క్రికెటర్లకు తోడుగా ఫామిలీస్‌ను కూడా పంపించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవరాల్‌గా వైరస్ దెబ్బకు కాస్త ఆందోళనకు గురైన బీసీసీఐ.. మళ్లీ క్రికెట్‌ను గాడిలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

జూన్ 2 ప్రయాణం..

జూన్ 2 ప్రయాణం..

సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘కఠిన క్వారంటైన్‌'లో ఉంటారు. ఇంగ్లండ్‌ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్‌ క్వారంటైన్‌'కు అనుమతించాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా సంప్రదింపులు జరుపుతోంది. హార్డ్‌ క్వారంటైన్‌లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్‌ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు.

క్వారంటైన్ తగ్గించాలని..

క్వారంటైన్ తగ్గించాలని..

సాఫ్ట్‌ క్వారంటైన్‌లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్‌ తరహాలో) చాన్స్ ఉంటుంది. ‘భారత్‌లోనే మనవాళ్లు హార్డ్‌ క్వారంటైన్‌లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్‌ టూ బబుల్‌లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్‌ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక అయిన ఏజియన్‌ బౌల్‌లో భాగంగానే హోటల్‌ హిల్టన్‌ ఉంది కాబట్టి సమస్య లేదు'అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సకుటుంబ సమేతంగా..

సకుటుంబ సమేతంగా..

క్వారంటైన్‌ ముగిసిన తర్వాతే జూన్‌ 13 నుంచి క్రికెటర్లు మైదానంలోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్‌ 18 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు నుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ‘కఠిన నిబంధనల కారణంగా ఆటగాళ్లు బయటకు వెళ్లే అవకాశం లేదు. పైగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన నెలరోజులకు ఇంగ్లండ్ సిరీస్ మొదలవుతోంది. టైమ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్‌ను వెంట తీసుకెళ్లేందుకు బోర్డు ఓకే చెప్పింది'అని బోర్డు అధికారి తెలిపారు.

ఫైనల్‌కు దాదా, జై షా

ఫైనల్‌కు దాదా, జై షా

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు వారి ట్రావెలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే దీనిపై బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ఇద్దరు ఇంగ్లండ్ వెళ్తే మాత్రం.. ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, May 9, 2021, 9:32 [IST]
Other articles published on May 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X