
లండన్: ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మొదటగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం ఇంగ్లండ్‌తో కోహ్లీసేన అయిదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 18 ఏళ్ల దాటిన వారు టీకా తీసుకోవచ్చు అని కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన తర్వాత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు.
ముంబైలో రెండు వారం పాటు క్వారెంటైన్‌లో ఉండనున్న భారత క్రికెటర్లు.. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత అక్కడ కూడా పది రోజులు క్వారెంటైన్‌లో ఉంటారు. అయితే భారత్‌లో తొలి డోసు తీసుకున్న కోహ్లీసేనకు.. రెండవ డోసు టీకాలను బ్రిటన్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇవ్వనున్నది. బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు రెండవ డోసు టీకాలను వేయించుకుంటుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లకు మూడుసార్లు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు కూడా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.
మరోవైపు టీమిండియాకు బ్రిటీష్ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. టీమిండియా సభ్యులను కఠిన క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ మంత్రాంగం ఫలించింది. భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ సెంకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అయితే బీసీసీఐ వినతి మేరకు కఠిన క్వారంటైన్ను ఇంగ్లీష్ ప్రభుత్వం కాస్త సడలించింది.
భారత టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ క్రిష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.