For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final Day 1 Rains: ఉరుములు..మెరుపులు..ఇంకా ఆశలున్నాయా? ఎల్లో వెదర్ వార్నింగ్

లండన్: క్రికెట్ ప్రేమికుల రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి కొట్టినట్టే కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఉత్కంఠభరిత క్షణాలు.. నీటిపాలైనట్టే. ఒక్క తొలి రోజు ఆట మాత్రమే కాదు.. దాదాపు ఈ ఫైనల్ మ్యాచ్ మొత్తానికీ వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణం అనుకూలించే సందర్భాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే తప్ప- పూర్తిగా మ్యాచ్ సాగే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. దీనికి ప్రధాన కారణం- ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న సౌథాంప్టన్‌లో వచ్చే వారం రోజులూ వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

ఎల్లో వెదర్ వార్నింగ్..

సౌథాంప్టన్‌లో వచ్చే ఆరు రోజులూ వర్షాలు పడొచ్చంటూ బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ (UK Met) వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్ (Yellow weather warning)ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. సౌథాంప్టన్ మొత్తంగా ఓ మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వచ్చే వారం రోజులూ ఇదే తరహా వాతావరణం సౌథాంప్టన్‌లో ఉండటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం- 16 డిగ్రీల ఉష్ణోగ్రతతో వర్షం కురుస్తోన్నట్లు తెలిపింది.

చిత్తడిగా గ్రౌండ్..

సౌథాంప్టన్‌లో ప్రస్తుతం సుమారు అయిదు గంటలుగా వర్షం కురుస్తూనే ఉంది. అప్పుడప్పుడు తెరపి ఇస్తోన్నప్పటికీ.. మేఘాలు పూర్తిగా తొలగిపోలేదు. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షం వల్ల ఏజెస్ బౌల్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. బురదమయమైంది. పిచ్‌ డ్యామేజ్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ దాన్ని కప్పి ఉంచారు. అవుట్ ఫీల్డ్‌లో వర్షపు నీళ్లు నిలిచాయి. వర్షం పూర్తిగా తొలగిపోతే గానీ.. దాన్ని ఆరబెట్టే చర్యలను తీసుకోలేకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఇంకొన్ని గంటలు కొనసాగితే మాత్రం తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినట్టే.

రిజర్వ్ డే ఉన్నా..

ఈ పరిస్థితులు ఉండొచ్చనే కారణంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక రోజు రిజర్వ్ డేగా ప్రకటించింది. దాన్ని ఇప్పుడే పరిగణనలోకి తీసుకుంటే.. శనివారం టాస్ పడే అవకాశాలు లేకపోలేదు. అయినప్పటికీ- శనివారం కూడా వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేదనేది బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ చేబుతోన్న మాట. శుక్రవారం నాటితో పోల్చుకుంటే- కొంత ఫర్వాలేదనిపించినప్పటికీ.. మ్యాచ్ కొనసాగేంతగా అనుకూల పరిస్థితులు ఉండకపోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ఆ తరువాత కూడా అవే పరిస్థితులు కొనసాగుతాయని తెలుస్తోంది.

Story first published: Friday, June 18, 2021, 9:59 [IST]
Other articles published on Jun 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+