WTC Final: సింగిల్ పోస్టర్: 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ హిస్టరీ.. నో అనిల్ కుంబ్లే ఫీట్

WTC Final Poster : ICC భారత లెజెండరీ Anil Kumble ఎక్కడ ?| 144 Years Of Test Cricket Glimpses

లండన్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC).. మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. లేని సమస్యను కొని తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్‌ను పురస్కరించుకుని కొత్తగా ఆవిష్కరించిన పోస్టర్ వివాదాస్పదమౌతోంది. కొన్ని అద్భుతాలను మిస్ చేసిందా పోస్టర్. ఐసీసీ మేనేజ్‌మెంట్ ఉద్దేశపూరకంగా చేసిందో.. లేక నిజంగానే మర్చిపోయిందో పక్కన పెడితే.. భారత క్రికెట్ జట్టును లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లేను అవమానించినట్టుగా భావిస్తోన్నారు అభిమానులు. దీనిపై ట్రోల్స్ చేయడానికి రెడీ అవుతోన్నారు.

చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్..

చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్..

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఐసీసీ విడుదల చేసిన పోస్టర్ ఇది. ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌..దానికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహించడం అనేది 144 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే మ్యాచ్ ఇది. క్రికెట్ ఉన్నన్నాళ్లూ ఈ మ్యాచ్‌కు సంబంధించిన ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. స్కోర్ కార్డులు చక్కర్లు కొడతాయి. కొన్ని దశాబ్దాల పాటు ఈ టైటిల్ విన్నర్ గురించి మాట్లాడుకుంటారు అభిమానులు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐసీసీ ఓ పోస్టర్‌ను రూపొందించింది.

తొలి మ్యాచ్‌ టు ఫైనల్ మ్యాచ్..

తొలి మ్యాచ్‌ టు ఫైనల్ మ్యాచ్..

1877లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ మొదలుకుని.. ఇంకొన్ని గంటల్లో ఆరంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు సేకరించిన కొన్ని గ్లింప్సెస్‌ను ఇందులో పొందుపరిచింది. లెజెండరీ క్రికెటర్ల ఫొటోలు, వారి బ్యాటింగ్, బౌలింగ్ శైలిని ప్రతిబింబించేలా దాన్ని రూపొందించింది. షేన్ వార్న్, అండర్సన్, ముత్తయ్య మురళీధరన్, ఇమ్రాన్ ఖాన్, జాక్వెస్ కల్లిస్, సచిన్ టెండుల్కర్, స్టీవ్ వా, షకీబుల్ హసన్, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ వంటి ఫొటోలను ముద్రించింది. ఈ విషయంలో ఐసీసీ ప్రయత్నాన్ని మెచ్చుకోదగ్గదే. ఇందులో సందేహాలు అక్కర్లేదు.

మైల్‌స్టోన్స్ ఏవీ..

మైల్‌స్టోన్స్ ఏవీ..

అదే సమయంలో కొన్ని మైల్‌స్టోన్స్‌ను విస్మరించింది. లెజెండరీ క్రికెటర్లు సాధించిన కొన్ని అరుదైన ఫీట్లను అందులో పొందుపర్చడంలో విఫలమైందని ఫ్యాన్స్ అంటోన్నారు. ప్రత్యేకించి- అనిల్ కుంబ్లే. టెస్ట్ క్రికెట్ ఫార్మట్‌లో అత్యంత అరుదుగా చెప్పుకొనే పది వికెట్లను పడగొట్టిన ఘనత అనిల్ కుంబ్లేకు ఉంది. ఒకే ఇన్నింగ్‌లో బ్యాట్స్‌మెన్లందరినీ అవుట్ చేశాడతను. మన దాయాది పాకిస్తాన్‌పై ఈ ఘనతను సాధించాడు. 1998-99లో భారత పర్యటనకు వచ్చిన పాకిస్తాన్‌పై కుంబ్లే ఈ రికార్డును అందుకున్నాడు.

పదికి పది

పదికి పది

డిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లందరూ అనిల్ కుంబ్లే బౌలింగ్‌కు దాసోహం అయ్యారు. రెండో ఇన్నింగ్‌లో పదికి పది వికెట్లనూ పడగొట్టాడు. దాన్ని ప్రతిబింబించేలా అనిల్ కుంబ్లే ఫొటోను ముద్రించకపోవడం వివాదానికి దారి తీస్తోంది. చారిత్రాత్మక పోస్టర్‌లో అంతే చారిత్రాత్మకమైన ఘట్టాన్ని, సందర్భాన్ని ఐసీసీ విస్మరించిందంటూ అభిమానులు మండిపడుతున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 18, 2021, 12:48 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X