అలా అయితే తప్పా భారత తుది జట్టులో మార్పులు ఉండవు: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్

సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలవ్వాల్సిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారీ వర్షం అడ్డుపడింది. దీంతో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. భారీ అంచనాలున్న ఈ మ్యాచ్‌లో కనీసం టాస్‌కు కూడా వాన దేవుడు చాన్స్ ఇవ్వలేదు. ఎడతెరిపి లేని వానకు తోడు బ్యాడ్ లైట్ వల్ల అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. అయితే ఈ టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లను జట్టులోకి తీసుకుంది. కానీ వర్షంతో ఫస్ట్ డే తుడిచి పెట్టుకుపోవడం.. మిగతా రోజుల్లో కూడా వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ ఫైనల్ ఎలెవన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో పాల్గొన్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ముందు ప్రస్తావించగా భిన్నంగా స్పందించాడు.

మార్పులుండవు.. కానీ

మార్పులుండవు.. కానీ

వర్షం కారణంగా ఒక రోజు ఆటను కోల్పోయినప్పటికీ తమ తుది జట్టులో మార్పులు ఉండవని ఆయన చెప్పుకొచ్చాడు. ‘కండీషన్స్‌తో సంబంధం లేకుండా పెర్ఫామ్ చేయగలిగే 11 మందినే ఎంపిక చేశాం. వెదర్ ఎలా ఉన్నా.. వికెట్ ఎలాంటిదైనా మా వాళ్లు అదరగొట్టగలరు. ఏదైనా అత్యవసరమైతే తప్ప మార్పులండవు. మ్యాచ్‌ను ఎలా నిర్వహించాలో ఐసీసీకి బాగా తెలుసు. మిగిలిన ఆట సజావుగా సాగితే రిజర్వ్ డేన నాలుగు గంటల పాటు ఆట ఉంటుందని అనుకుంటున్నాం. మాతోపాటు ఫ్యాన్స్ కూడా మ్యాచ్ రిజల్ట్ రావాలనే కోరుకుంటున్నారు'అని చెప్పాడు.

 ఆటగాళ్లకు బాగా తెలుసు..

ఆటగాళ్లకు బాగా తెలుసు..

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎదురయ్యే సవాళ్ల గురించి, పరిస్థితుల గురించి భారత ఆటగాళ్లకు బాగా తెలుసని, వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. జట్టులోని ఆటగాళ్లకు మెగా ఫైనల్స్ ఆడిన అనుభవం ఉందని, డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటమే వారికి పెద్ద మోటివేషన్ అని, ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసన్నాడు. వాతవారణలో అకాల మార్పులపై కూడా వారికి అవగాహన ఉందని, ఆ సవాళ్లను ఎలా స్వీకరించాలో కూడా తెలుసని చెప్పుకొచ్చాడు. ఇక మహిళల ఏకైక టెస్ట్‌పై స్పందిస్తూ షెఫాలీ వర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమెలో మరో సెహ్వాగ్ కనబడుతున్నాడని కొనియాడాడు.

 టాస్ వరకు ఏదీ ఫైనల్‌ కాదు:

టాస్ వరకు ఏదీ ఫైనల్‌ కాదు:

ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్‌ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఫైనల్ కోసం గురువారమే భారత్‌ తుది జట్టును ప్రకటించింది. కానీ ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ సమయంలో తమ ఆటగాళ్ల జాబితా పత్రాన్ని మార్చుకునే వరకు ఏదీ ఫైనల్‌ కాదు. దీన్నిబట్టి అప్పటివరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు. నేను ఆడే రోజుల్లో కెప్టెన్‌గా ఉన్నప్పుడు స్పిన్నర్‌ను తీసుకోవాలా లేదా అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలా అనే సందేహం తలెత్తినప్పుడు.. ప్రత్యర్థి జట్టును చూసి జట్టులో మార్పులు చేసేవాడిని. అలా టాస్‌ వేసేవరకు ఎవరినైనా మార్చవచ్చు' అని అన్నారు.

 స్పిన్నర్‌ను తప్పించొచ్చు:

స్పిన్నర్‌ను తప్పించొచ్చు:

'ఇప్పుడు సౌథాంప్టన్‌లో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని భారత్‌ ఆలోచించొచ్చని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. ఈ వాతావరణం న్యూజిలాండ్‌ బౌలర్లకు బాగా అనుకూలం. కివీస్ జట్టులో స్వింగ్ చేసే బౌలర్లు ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. రిషబ్ పంత్‌ ఇప్పుడు ఆరో స్థానంలో ఆడనున్నాడు. ఇంకో బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే.. అతడు ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక స్పిన్నర్‌ను తప్పించొచ్చు' అని సునీల్‌ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఆరో స్థానంలో హనుమ విహారి గతంలో బాగా ఆడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాల్లో అతని రికార్డు బాగుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 19, 2021, 12:14 [IST]
Other articles published on Jun 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X