WTC final day 5: సౌథాంప్టన్ మిస్టరీ: చివరిరోజు ఏం జరగబోతోంది..ఐసీసీ ఏం చెబుతుంది

లండన్: ఇన్ని రోజులూ ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్.. చివరి రోజుకు చేరింది. ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు అభిమానులు ఎంత ఉత్కంఠతకు గురి అయ్యారో.. ఫైనల్ డే కూడా అదే రేంజ్‌లో టెన్షన్ పెడుతోంది. చివరి రోజు మ్యాచ్ కొనసాగడానికి అనుకూల వాతవారణం ఉండటం ఒక ఎత్తయితే.. ఈ ఒక్కరోజే ఫలితం తేలే అవకాశం లేకపోవడం మరో ఎత్తు. దీనితో అందరి కళ్లూ మ్యాచ్ రెఫరీపై పడ్డాయి. రెఫరీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది మిస్టరీగా మారింది.

విండీస్ దుమ్ము దులిపిన కేశవ్: హ్యాట్రిక్ ప్లస్: ఇన్నేళ్ల తరువాత ఓ సౌతాఫ్రికన్ ఖాతాలో ఆ రికార్డ్విండీస్ దుమ్ము దులిపిన కేశవ్: హ్యాట్రిక్ ప్లస్: ఇన్నేళ్ల తరువాత ఓ సౌతాఫ్రికన్ ఖాతాలో ఆ రికార్డ్

చివరిరోజు వెదర్ క్లియర్..

చివరిరోజు వెదర్ క్లియర్..

తొలి..నాలుగో రోజు సెషన్లను పూర్తిగా తుడిచి పెట్టేశాయి భారీ వర్షాలు. రెండు, మూడోరోజు మాత్రమే ఆట కొనసాగింది. అది కూడా అంతంతమాత్రంగానే. వర్షం పడకపోయినప్పటికీ- వెలుతురు లేమి మ్యాచ్‌ను వెంటాడింది. ఫలితంగా నిర్దేశిత గడువు కంటే ముందే ఇన్నింగ్‌ను ముగించేయాల్సి వచ్చింది. డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరుకోవాల్సి వచ్చింది ప్లేయర్లకు. నాలుగోరోజు కూడా ఒక్క బంతి కూడా పడలేదు. ఎడతెరిపినివ్వని వర్షం కారణంగా అన్ని సెషన్లూ రద్దయ్యాయి. అయిదో రోజు ఈ పరిస్థితి లేదు. వర్షం వెలిసింది. మేఘాలు కమ్ముకున్నప్పటికీ- వర్షం పడే అవకాశం లేదని బ్రిటన్ వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.

ఇదే చివరిరోజు అవుతుందా?

ఇదే చివరిరోజు అవుతుందా?

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో- మంగళవారమే చివరిరోజు అవుతుందా? ప్రస్తుతం అభిమానుల మెదళ్లను తినేస్తోన్న ప్రశ్న ఇది. కనీసం 80 ఓవర్లు పడే అవకాశం ఉన్నప్పటికీ.. ఫలితం తేలడం అసాధ్యం. న్యూజిలాండ్ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్ బిగినింగ్‌లోనే ఉంది. టీమిండియా ఇంకా రెండో ఇన్నింగ్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండూ రెండో ఇన్నింగ్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్కరోజులోనే ఇవన్నీ సాధ్యం కావడానికి ఛాన్సే లేదు. దీనితో మ్యాచ్ డ్రాగా ముగియడమా? లేక రిజర్వ్ డేకు తీసుకెళ్లడమా? అనేది తేలాల్సి ఉంది. ఈ బాధ్యత మ్యాచ్ రెఫరీ మీద ఉంది.

డ్రాగా ముగించడానికే ఛాన్స్..

డ్రాగా ముగించడానికే ఛాన్స్..

వర్షం పడుతుందని ముందుగానే ఊహించిందో ఏమో గానీ.. ఐసీసీ కాస్త ముందుచూపుతో వ్యవహరించింది. చారిత్రాత్మక మ్యాచ్ కావడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రిజర్వ్ డేను అందుబాటులోకి తీసుకొచ్చింది. వర్షం వల్ల ఏవైనా కొన్ని సెషన్లు స్తంభించిపోతే.. రిజర్వ్ డే పనికొస్తుందనేది ఐసీసీ ఐడియా. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ- ఇక్కడ తుడిచిపెట్టుకుని పోయింది. ఒకటో రెండో సెషన్లు కావు. మొత్తంగా రెండురోజుల మ్యాచ్ రద్దయింది. దీన్ని కాంపెన్సేట్ చేయాలంటే.. రిజర్వ్ డే ఒక్కటే చాలదు. న్యూజిలాండ్ ఆడుతోన్న తొలి ఇన్నింగ్‌ను కూడా లెక్కలోకి తీసుకుంటే.. మూడు ఇన్నింగ్‌లను సాగించాల్సి ఉంటుంది.

రిజర్వ్ డేపై ప్రకటన..

రిజర్వ్ డేపై ప్రకటన..

రిజర్వ్ డే దాకా మ్యాచ్‌ను తీసుకెళ్లాలంటే.. ఆయా పరిణామాలన్నింటినీ మ్యాచ్ రెఫరీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా న్యూజిలాండ్ బ్యాటింగ్ మీద ఆధారపడి ఉంది. ఈ ఇన్నింగ్‌లో బ్లాక్ క్యాప్స్ గనక పెవిలియన్‌కు క్యూ కడితే.. ఖచ్చితంగా రిజర్వ్ డే ఉంటుంది. ఇందులో సందేహాలు అక్కర్లేదు. లేదూ- కివీస్ బ్యాట్స్‌మెన్లు నిలదొక్కుకుని రోజంతా ఆడితే మాత్రం డ్రాగా ముగించడానికే అవకాశాలు ఉన్నాయి. ఇందులోనూ డౌట్స్ అనవసరం. ఏదేమైనా ఈ చివరిరోజు న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ల ఆటతీరు ప్రభావం చూపుతుంది. దీని ఆధారంగా ఐసీసీ తన నిర్ణయాన్ని ఇవ్వాళే ప్రకటిస్తుంది. రిజర్వ్ డేపై తేల్చేయనున్నారు మ్యాచ్ రెఫరీ.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, June 22, 2021, 8:28 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X