న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC final day 5: ఇంటిపక్కనే స్టేడియం పెట్టుకుని: ఓ ప్లానింగ్ లేదు..పాడూ లేదు: ఐసీసీపై ఫైర్

WTC final day 5: VVS Laxman, Virender Sehwag and Shane Bond unhappy with ICC’s plan
WTC Final: Draw చేసేకాడికి ఫైనల్ ఎందుకు ? ICC వేస్ట్, ఫలితం తేలకపోతే అప్పుడు ఉంటది మీకు ?

లండన్: చారిత్రాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మ్యాచ్‌లో వరుణుడే విన్నర్‌గా నిలవడానికి అవకాశాలు లేకపోలేదు. తొలి, నాలుగోరోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకోవడం, రిజర్వ్ డే ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితులు ఏర్పడటం వల్ల ప్రతిష్ఠాత్మక మ్యాచ్ గంగపాలు అయిందనే ఆక్రోశం అభిమానుల్లో వ్యక్తమౌతోంది. రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. అప్పుడు కూడా వర్షం పడదనడానికి గ్యారంటీ లేదు. దీన్నంతటికీ- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ విషయంలో పలువురు మాజీ క్రికెటర్లు ఐసీసీ వైపు వేలెత్తి చూపుతోన్నారు.

WTC final day 5: సౌథాంప్టన్ మిస్టరీ: చివరిరోజు ఏం జరగబోతోంది..ఐసీసీ ఏం చెబుతుందిWTC final day 5: సౌథాంప్టన్ మిస్టరీ: చివరిరోజు ఏం జరగబోతోంది..ఐసీసీ ఏం చెబుతుంది

సౌథాంప్టన్‌ వాతావరణం పట్ల ఏ మాత్రం అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటోన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఐసీసీ రూపొందించిన నిబంధనలు అంచనాలు తప్పాయని చెబుతున్నారు. ఐసీసీ ప్లానింగ్ పట్ల మాజీ ప్లేయర్లు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ బాండ్, కెవిన్ పీటర్సన్ వంటి మాజీలు మండిపడుతున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్ ఫలితం తేలకపోతే..ఏ జట్టు గానీ, అభిమానులు గానీ హ్యాపీగా ఉండబోరని కామెంట్స్ చేస్తోన్నారు.

రిజర్వ్ డేను అందుబాటులోకి తీసుకుని రావడం స్వాగతించదగ్గదే అయినప్పటికీ.. ఈ వర్షం ఇలాగే కొనసాగితే.. అప్పుడు కూడా రిజల్ట్ వస్తుందని తాను అనుకోవట్లేదని వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. 450 ఓవర్ల మ్యాచ్ ఆడాల్సిన చోట 90 ఓవర్లు కూడా పడట్లేదని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తనదైన శైలిలో ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. బ్యాట్స్‌మెన్లకే కాదు.. ఐసీసీకి కూడా టైమ్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశాడు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను హడావుడిగా షెడ్యూల్ చేసినట్టు కనిపిస్తోందంటూ సెహ్వాగ్ పరోక్షంగా చురకలు అంటించాడు.

ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ కూడా ఐసీసీని తప్పుపట్టాడు. సౌథాంప్టన్ వాతావరణం ఎప్పుడు? ఎలా ఉంటుందనేది అర్థం కాదని, అలాంటి చోట డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించడం సరికాదని పేర్కొన్నాడు. తటస్థ వేదిక మీదే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహించాలనుకుంటే- తన బెస్ట్ ఆప్షన్ దుబాయ్ అని స్పష్టం చేశాడు. అద్భుతమైన స్టేడియం, గ్యారంటీ వెదర్, మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయని కెవిన్ చెప్పుకొచ్చాడు. అన్నింటికీ మించి ఐసీసీకి దుబాయ్ హోమ్‌టౌన్ అని చెప్పాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పక్కనే దుబాయ్ ఆఫీస్ ఉంటుందని గుర్తు చేశాడు.

Story first published: Tuesday, June 22, 2021, 10:13 [IST]
Other articles published on Jun 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X