WTC Final Day 5 Review: డేంజర్ జోన్‌లో కోహ్లీసేన.. దెబ్బతీసిన జెమీసన్, సౌథీ.. 3+2 ఫార్ములా ఫ్లాఫ్!

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ డ్రా అయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ కోహ్లీసేన డేంజర్ జోన్‌లో పడింది. వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఐదో రోజు ఆట పూర్తిగా కొనసాగినప్పటికీ ఇరు జట్లు హోరాహోరీ తలపడ్డాయి. తొలి రెండు సెషన్లు ఆధిపత్యం కనబర్చిన భారత్ కీలక చివరి సెషన్‌లో తడబడి కష్టాలు కొని తెచ్చుకుంది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 249 రన్స్ చేసి 32 పరుగులు లీడ్ సాధించగా... ఆట ముగిసే సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 64 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(55 బంతుల్లో 12 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 8) ఉన్నారు. ప్రస్తుతం భారత్ కివీస్ కన్నా 32 పరుగుల ఆధిక్యంలోనే ఉంది. రిజర్వ్ డే అయిన బుధవారం కోహ్లీసేన కేర్‌ఫుల్‌గా ఆడకుండా వికెట్లు పారేసుకుంటే మాత్రం న్యూజిలాండ్‌కు విజయవకాశాలుంటాయి.

ముఖ్యంగా ఫస్ట్ సెషన్‌లో వికెట్లు చేజార్చుకోకుండా పాతుకుపోతేనే గట్టెక్కుతుంది.అయితే ఐదో రోజు ఫస్ట్ సెషన్‌లో బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్‌పై భారత్ పట్టుబిగించినట్లు కనిపించింది. కానీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులో పాతుకుపోవడం.. చివర్లో కైల్ జెమీసన్(22), టీమ్ సౌథీ(30) బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చడం.. ఓపెనర్ల వైఫల్యం విన్నింగ్ రేస్ నుంచి భారత్‌ను తప్పేలా చేశాయి.

 జెమీసన్ రాక టర్నింగ్..

జెమీసన్ రాక టర్నింగ్..

అంతా ఊహించినట్లుగానే ఫస్ట్ సెషన్‌లో భారత బౌలర్లు దుమ్ములేపారు. ముఖ్యంగా షమీ, ఇషాంత్ రఫ్ఫాడించారు. పిచ్ నుంచి లభించిన సహకారానికి కోహ్లీ స్పాట్ కెప్టెన్సీ.. సూపర్ ఫీల్డింగ్ తోడవడంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో కివీస్ 200 పరుగులలోపే ఆలౌటవుతుందనిపించింది. కానీ ఓ వైపు వికెట్లు పడుతున్నా..మరోవైపు కేన్ విలియమ్సన్ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయాడు. ఎలాంటి బంతి వేసినా డిఫెన్స్ చేస్తూ అడపా దడపా సింగిల్స్‌తో భారత బౌలర్లను సతాయించాడు. అతనికి జత కలిసిన జెమీసన్ మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు. ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. మ్యాచ్‌లో ఫస్ట్ సిక్స్ బాదాడు. షమీ బౌలింగ్‌లో ఔటైనప్పటికీ 16 బంతుల్లోనే 21 రన్స్ చేసి భారత్‌కు చేయాల్సిన నష్టం చేశాడు.

త్వరగా ఔట్ చేసి ఉండుంటే..

త్వరగా ఔట్ చేసి ఉండుంటే..

జెమీసన్ చూపించిన హిట్టింగ్‌తో విలియమ్సన్ సైతం గేర్ మార్చాడు. తనదైన క్లాసిక్ షాట్స్‌తో బౌండరీలు రాబట్టాడు. దాంతో కివీస్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. క్రీజులోకి వచ్చిన టీమ్ సౌథీ సైతం బ్యాట్స్‌మన్‌లా రాణించాడు. విలియమ్సన్(49), నీల్ వాగ్నర్ ఔటైనప్పటికీ రెండు భారీ సిక్స్‌లతో 46 బంతుల్లో 30 పరుగులు చేసి కివీస్‌కు 32 రన్స్ లీడ్ అందించాడు. ఇదే భారత్‌ను ఆత్మరక్షణలో ఆడేలా చేసింది. కేన్ విలియమ్స‌న్‌ను ముందే ఔట్ చేసి.. జెమీసన్, సౌథీని కట్టడిచేస్తే న్యూజిలాండ్ 200 పరుగుల లోపే ఆలౌటయ్యేది. అప్పుడు కివీస్‌పై భారత్ పై చేయి సాధించడానికి వీలుండేది.

3+2 కాంబినేషన్ ప్లాఫ్

3+2 కాంబినేషన్ ప్లాఫ్

ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్మూల టీమిండియాకు నష్టం చేకూర్చింది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడం వల్ల పిచ్ పూర్తిగా పేసర్లకే అనుకూలించింది. ముఖ్యంగా స్వింగ్ బౌలర్ల ఆధిపత్యమే నడిచింది. దాంతో ఐదో రోజు ఆటలో స్పిన్నర్లు పెద్దగా బౌలింగ్ చేసే చాన్స్ రాలేదు. టెయిలెండర్లకు మాత్రమే చేశారు. ఇది భారత పేసర్లకు భారంగా మారింది. పైగా బుమ్రా వైఫల్యం ఇంకా దెబ్బతీసింది. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టినా.. ఒక్క వికెట్ తీయకపోవడంతో భారమంతా ఇషాంత్, షమీలపైనే పడింది. ఇది కివీస్‌కు లాభం చేసింది.

 పేస్ ఆల్‌రౌండర్ ఉండుంటే..?

పేస్ ఆల్‌రౌండర్ ఉండుంటే..?

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌కు ఉన్న ప్రధాన తేడా పేస్ ఆల్‌రౌండర్స్. టేలెండర్స్ బ్యాటింగ్.. భారత జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. కామెంటేటర్లు సైతం పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. జెమీసన్ లాంటి ఓ పేస్ ఆల్‌రౌండర్ జట్టులో ఉండుంటే భారత్‌ పరిస్థితి మెరుగ్గా ఉండేదన్నారు. అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లోను కోహ్లీసేనకు కలిసొచ్చేదని చెప్పారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ల వైఫల్యం కూడా భారత్‌ను కష్టాల్లో పడేసింది. శుభ్ మన్ గిల్ (8) ఆదిలోనే ఔటవ్వడం.. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న రోహిత్ శర్మ(30) ఎల్బీగా పెవిలియన్ చేరడం భారత్‌ను కష్టాల్లో పడేసింది. డ్రా కోసం పోరాడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, June 23, 2021, 7:17 [IST]
Other articles published on Jun 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X