Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final: ఫస్ట్‌టైమ్..క్రికెట్ గ్రౌండ్‌లో క్రిప్టోకరెన్సీ కంపెనీ ఎంట్రీ

 WTC final: CoinDCX is the official sponsor of the match, announcements leads to trending

లండన్: ఎప్పుడెప్పుడా అంటూ ఇన్నాళ్లూ ఎదురు చూసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్ గడువు వచ్చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా.. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కాబోతోంది. భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ కోసం కాయిన్ గాల్లోకి లేస్తుంది..అది కూడా వరుణ దేవుడు కరుణిస్తేనే. వాతావరణం అనుకూలిస్తే మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. రాత్రి 10 గంటలకు తొలి రోజు ఆట ముగుస్తుంది. మొత్తం నాలుగు సెషన్లలో సాగుతుందీ మ్యాచ్.

అధికారిక స్పాన్సరర్‌గా

ఈ మ్యాచ్ అధికారిక స్పాన్సరర్‌గా క్రిప్టోకరెన్సీ కంపెనీ కాయిన్ డీసీఎక్స్ (CoinDCX) వ్యవహరించనుంది. అంటే- క్రికెట్ గ్రౌండ్‌లో ఈ కంపెనీకి చెందిన అడ్వర్టయిజ్‌మెంట్స్ కనిపిస్తాయి. దీనికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియను పూర్తి చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసమే కాదు.. భారత మహిళల క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ మధ్య సాగుతోన్న టెస్ట్ మ్యాచ్‌కు కూడా ఈ క్రిప్టోకరెన్సీ కంపెనీనే అఫీషియల్ స్పాన్సరర్. దీనికి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్స్ గ్రౌండ్‌లో, బౌండరీ లైన్ల వద్ద విస్తృతంగా కనిపిస్తోన్నాయి. ఓ క్రిప్టోకరెన్సీ కంపెనీ క్రికెట్ మ్యాచ్‌లకు అధికారిక స్పాన్సరర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.

ట్రెండింగ్‌గా నిలిచి..

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తాము అధికారిక స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోన్నాంటూ కాయిన్ డీసీఎక్స్ ప్రకటించిన వెంటనే.. దాని పేరు భారత్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. #WTCWithCoinDCX అనే హ్యాష్‌ట్యాగ్‌ను అటు క్రికెట్ ప్రేమికులు.. ఇటు క్రిప్టోకరెన్సీపై ఆసక్తి ఉన్నవారు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. క్రికెట్‌తో క్రిప్టోకరెన్సీ జట్టుకట్టడం కొన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందంటూ ట్వీట్లు చేస్తోన్నారు. ఇలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తోన్నామంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. క్రికెట్‌తో కలవడం వల్ల భారత్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టయిందంటూ చెబుతున్నారు.

సింగపూర్ బేస్డ్ కంపెనీ

కాయిన్ డీసీఎక్స్.. సింగపూర్‌కు చెందిన క్రిప్టోకరెన్సీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఆధారిత వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోంది.. దానికి సంబంధించిన ఫైనాన్సియల్ సర్వీసులను అందజేస్తోంది. ఇలాంటి ఓ క్రిప్టోకరెన్సీ కంపెనీ.. క్రికెట్‌ మ్యాచ్‌లకు అధికారికంగా స్పాన్సరర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. మనవాళ్లు దాని మీద ఆసక్తి చూపడానికి ఇదే ప్రధాన కారణమైంది. దానికి అనుగుణంగా క్రికెట్ ప్రేమికులు.. ఆ కంపెనీకి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతోన్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగించాలని కోరుకుంటోన్నారు. ఈ దిశగా కుప్పలు తెప్పలుగా ట్వీట్లు చేస్తోన్నారు.

క్రిప్టోకరెన్సీ అంటే..

క్రిప్టోకరెన్సీని డిజిటల్ కరెన్సీతో పోల్చవచ్చు. దీనికి సంబంధించిన లావాదేవీలపై రిజర్వుబ్యాంక్ లేదా ప్రభుత్వ సంస్థలకు ఎలాంటి పెత్తనం లేదు. రూపాయల్లో, లేదా నాణేల్లో దాన్ని మనం చూడలేం. అంతా డిజిటల్ మయం. కంటికి కనిపించని కరెన్సీ అది. అంకెలు మాత్రమే ఉంటాయి. ఏ దేశానికి చెందిన వారు ఆ దేశ కరెన్సీతో మార్పడి చేసుకునే వీలు ఉంది. బిట్ కాయిన్, లైట్ కాయిన్, ఎథేరియమ్, జెడ్ క్యాష్ వంటి క్రిప్టోకరెన్సీలు ప్రస్తుతం అంతర్జాతీయంగా చలామణిలో ఉన్నాయి. అందులో మనకు బాగా చిరపరిచితమైన పేరు బిట్ కాయిన్. 2009లో ఇది ఎంట్రీ ఇచ్చింది.

Story first published: Friday, June 18, 2021, 8:32 [IST]
Other articles published on Jun 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+