Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final : ముగ్గురు కుర్రాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అవకాశం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు భారత జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ గాయాలతో ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గాయాల జాబితా మరింత పెద్దదైంది.

బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు. అతని గాయం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా ఐపీఎల్‌కు అతను దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం లక్నోలో ఉన్న అతను గురువారం నాడు ముంబై బయలు దేరతాడట. అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత.. అతనికి కావలసిన చికిత్స అందిస్తారు.

India Test Team

రాహుల్ చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బీసీసీఐ పర్యవేక్షిస్తుంది. అతని గాయం కనుక పూర్తిగా తగ్గకపోతే రాహుల్ ఈసారి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం కష్టమే. అతనితోపాటు ఇప్పటికే గాయాలతో బాధ పడుతున్న ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ కూడా ఇంగ్లండ్ వెళ్లేది అనుమానంగా కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా జయదేవ్ ఉనద్కత్ కూడా చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న అతను.. నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఫాలో అప్‌లో కింద పడిపోయాడు. దీంతో అతని భుజానికి గాయమైంది. ఈ గాయం కారణంగా అతను కూడా మిగతా ఐపీఎల్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతను కోలుకోలేదంటే ఉనద్కత్ కూడా ఇంగ్లండ్ వెళ్లలేడు.

కొన్ని రోజుల క్రితం డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో ప్రకటించిన ఈ జట్టులో ఉనద్కత్, రాహుల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ నలుగురూ ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ అహ్మద్‌ను రిజర్వ్ ప్లేయర్లుగా పంపాలని బీసీసీఐ యోచిస్తోంది.

అసలు ఆటగాళ్లు ఆడే అవకాశం లేనప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఇలా నలుగురు ప్లేయర్లు పూర్తి ఫిట్‌నెస్‌గా లేకపోతే ఆశ్చర్యపోతారు. ఇలా ముగ్గురు కుర్రాళ్లకు డబ్ల్యూటీసీ అవకాశాలు రావడంపై కూడా ఫ్యాన్స్ రకరకాలుగా ఫ్యూన్ సిస్టంగా కనిపించాడు.

Story first published: Wednesday, May 3, 2023, 18:17 [IST]
Other articles published on May 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+