WTC Final 2027: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీలు వచ్చేశాయ్! ఎక్కడ, ఎప్పుడు అంటే?
WTC Final 2027: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2027లో జరగనుంది. ఈ టోర్నీ 2025లో ప్రారంభమైంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో 9 జట్లు పాల్గొంటున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. 2027 తర్వాత 2029, 2031 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్స్ ఇంగ్లాండ్‌లో జరుగుతాయని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
ఓవల్‌లో జరగనున్న ఫైనల్ మ్యాచ్
2027 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఫైనల్ లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జరుగుతుంది. ఫైనల్ జూన్ 9న ప్రారంభమై జూన్ 13 వరకు కొనసాగుతుంది. 2023లో జరిగిన రెండో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా ఓవల్ స్టేడియమే ఆతిథ్యం ఇచ్చింది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత స్థితి
గత సంవత్సరం జూన్ 17న బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 8 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో, 87.5 శాతం పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా 75 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 2023లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకోగా.. 2025లో ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.
5వ స్థానంలో భారత జట్టు
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టుకు ఈ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సీజన్ అంతగా కలిసి రాలేదు . ఆ జట్టు తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ డ్రా చేసుకోగా.. వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన సిరీస్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది.భారత జట్టు ఇప్పుడు వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

