Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంత అవమానం ఏ క్రికెటర్‌కూ జరగలేదు.. టీమిండియాపై మాజీ లెజెండ్ ఆగ్రహం!

ప్రపంచ నెంబర్ వన్ టెస్టు బౌలర్, రెండో ర్యాంకు ఆల్‌రౌండర్.. అలాంటి ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడలేదంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి నిర్ణయం ఆ జట్టు ఎలా తీసుకుందని ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. కొన్ని రోజుల క్రితం ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు అదే పని చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న అశ్విన్‌ను పక్కన పెట్టేసింది.

ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ చక్కగా రాణించాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా ఫర్వాలేదనిపించాడు. బంతితోపాటు బ్యాటుతోనూ కొన్ని విలువైన పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడించకపోవడంపై టీమిండియాను కొందరు మాజీలు తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్‌ మొదలవడానికి వారం ముందు నుంచి అశ్విన్‌ను ఆడించడంపై పెద్ద చర్చ జరిగింది.

WTC Final 2023 Sunil Gavaskar angry on Team India for treating Ashwin unfairly

అయితే ఆస్ట్రేలియా జట్టులో ఎక్కువ మంది ఎడం చేతి వాటం బ్యాటర్లు ఉండటం, వారిపై అశ్విన్ రికార్డు అద్భుతంగా ఉండటంతో అతన్ని కచ్చితంగా ఆడిస్తారని అంతా అనుకున్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ అలా చేయలేదు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని భావించి, అశ్విన్‌ను పక్కన పెట్టేసింది. దీనిపై తాజాగా లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

మోడర్న్ క్రికెట్ ఏ ఆటగాడికీ ఇంత అవమానం జరగలేదని, అశ్విన్ విషయంలో టీమిండియా ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తోందని మండిపడ్డాడీ లిటిల్ మాస్టర్. అశ్విన్‌కు ఇలా జరగడం కొత్తేం కాదని, అసలు లాజిక్ లేని ఇలాంటి నిర్ణయాల వల్లే అతను ఇంకా 100 టెస్టుల మైలురాయి కూడా చేరుకోలేదని గవాస్కర్ చెప్పాడు. ఒక టాప్ క్లాస్ ఆటగాడిని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం తానెప్పుడూ చూడలేదన్నాడు.

'మోడర్న్ ఎరాలో మరే ఇతర టాప్ క్లాస్ భారత క్రికెటర్‌ను ఇలా ట్రీట్ చేయడం నేను చూడలేదు. టీంలో నెంబర్ వన్ ర్యాంకు బ్యాటర్ ఉన్నాడనుకోండి. అతను గతంలో గ్రీన్ పిచ్‌లపై పరుగులు చేయలేదని, స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై రాణించలేదని జట్టులోకి తీసుకోకుండా ఉంటారా? కచ్చితంగా ఆ పని చేయరు. మరి అశ్విన్ విషయంలో ఎప్పుడూ ఇలాగే ఎందుకు చేస్తున్నారు?' అని సన్నీ ప్రశ్నించాడు.

'అశ్విన్ విషయంలో ఇలా చాలా కాలంగా ఇదే జరుగుతోంది. ఇలా సరైన లాజిక్ లేని ఈ నిర్ణయం వల్ల అతను చాలా కోల్పోయాడు. లేదంటే ఇప్పటికే 100 టెస్టు మ్యాచులు పూర్తి చేసుకోవాల్సిన ప్లేయర్ అతను' అని గవాస్కర్ ఒక ప్రముఖ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం నెంబర్ వన్ టెస్టు బౌలర్ అయిన అశ్విన్.. తన కెరీర్‌లో 92 మ్యాచులు ఆడాడు. వీటిలో 474 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, 32 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.

Story first published: Tuesday, June 13, 2023, 13:34 [IST]
Other articles published on Jun 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+