WTC Final: టీమిండియా బ్యాట్స్‌మెన్‌.. పాత సినిమాల్లో పోలీసులు చేసిందే చేయండి!!

WTC Final : Team India Batsmen పోలీసుల్లా చేయండి.. NZ Bowlers రెచ్చిపోతారు || Oneindia Telugu

ముంబై: సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఈ మెగా సమరం కోసం అభిమానులే కాకుండా ప్లేయర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక క్రికెట్ మాజీలు ఇరు జట్లకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఓ సలహా ఇచ్చారు. అయితే అది కోడ్ లాంగ్వేజ్‌లో ఉండడం విశేషం. జాఫర్ ఇలా కోడ్ లాంగ్వేజ్‌లో భారత జట్టుకు సూచనలు ఇవ్వడం ఇదేం తొలిసారి మాత్రం కాదు.

WTC Final: బ్యాటింగ్ or సీమింగ్.. పిచ్ ఏదైనా టీమిండియాదే పైచేయి! కారణం ఏంటో చెప్పిన వెంకటేశ్‌!WTC Final: బ్యాటింగ్ or సీమింగ్.. పిచ్ ఏదైనా టీమిండియాదే పైచేయి! కారణం ఏంటో చెప్పిన వెంకటేశ్‌!

పోలీసులు చేసిందే చేయండి:

పోలీసులు చేసిందే చేయండి:

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్‌లు ఎలా ఆడాలి అనేదానిపై వసీం జాఫర్ తాజాగా తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. మాజీ ఓపెనర్ జాఫర్ మాట్లాడుతూ... 'భారత్ జట్టుతో కలిసి నేను రెండు సార్లు ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లాను. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి నేను కోడ్ రూపంలో చెప్పేది ఒక్కటే. బాలీవుడ్ పాత సినిమాల్లో పోలీసులు సాధారణంగా చేసే పనినే ఫైనల్లో చేయండి' అని సూచించారు. సోషల్ మీడియాలో జాఫర్‌ ఎపుడూ యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరపున 31 టెస్టులు, 2 వన్డేలు ఆడారు.

సూచన ఏంటంటే?:

సూచన ఏంటంటే?:

సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లోని పిచ్ పేసర్లకు అనుకూలించనుందని సమాచారం. ఇంగ్లండ్ పరిస్థితులు కివీస్ పేసర్లకు బాగా అనుకూలించనున్నాయి. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్ మరియు కైల్ జేమిన్సన్‌లతో న్యూజిలాండ్‌ పేస్ విభాగం పటిష్టంగా ఉంది. సౌథాంప్టన్ పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్లు స్వింగ్ రాబట్టగలరని అందరూ అంచనా వేస్తుండగా.. వసీం జాఫర్ కోడ్‌ లాంగ్వేజ్‌లో చేసిన సూచన ఏంటంటే?. బాలీవుడ్ పాత సినిమాల్లో సాధారణంగా పోలీసులు ఆలస్యంగా వస్తుంటారు. దొంగతనం, మర్డర్, రేప్ లాంటివి జరిగిన తర్వాత ఆలస్యంగా సంఘటనా స్థలానికి వస్తుంటారు. ఒకవేళ పిచ్ నుంచి కివీస్ బౌలర్లకి సహకారం లభిస్తే.. బంతిని ఆలస్యంగా ఆడాలని భారత ఆటగాళ్లకు జాఫర్ చెప్పాడు.

టీమిండియాకు సవాల్‌ విసురుతోన్న కివీస్:

టీమిండియాకు సవాల్‌ విసురుతోన్న కివీస్:

ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుని జోరు మీదున్న న్యూజిలాండ్‌.. టీమిండియాకు సవాల్‌ విసురుతుంది. ఇక ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా సైతం అదగొట్టి టైటిల్‌ పోరుకు సై అంటుంటోంది. ఈ మ్యాచ్‌లో యువ ప్లేయర్ రిషబ్‌ పంత్‌ (94 బంతుల్లో 121 నాటౌట్‌) సెంచరీ చేయగా.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (85), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (54) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లు ఇషాంత్‌ శర్మ (3/36), మహ్మద్‌ సిరాజ్‌ (2/22)లు రాణించారు.

31 టెస్టులు ఆడి 1944 పరుగులు:

31 టెస్టులు ఆడి 1944 పరుగులు:

వసీం జాఫర్‌ గతేడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికారు. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించారు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (150) ఆడిన ఆటగాడు జాఫరే కావడం విశేషం. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించారు. 1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌.. మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19410 పరుగులు బాదారు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వసీం జాఫర్‌ గతేడాది మార్చిలో ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితులయ్యారు. అయితే ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 14, 2021, 22:24 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X