Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: వైరల్ వీడియో.. శునకంతో రవిశాస్త్రి ప్రాక్టీస్!!

WTC Final 2021: Team India coach Ravi Shastri Plays With dog in Southampton

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముమ్మరంగా సన్నద్ధమవుతోంది. సౌథాంప్టన్‌లోని ఏజీస్‌ బౌల్‌ మైదానంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. మంగళవారం సాధన ముగిసిన తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సరదాగా శునకంతో ఆడుకున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత విన్‌స్టన్‌ (శునకం)కు టెన్నిస్‌ బాల్‌ను విసిరి క్యాచ్‌ అందుకోమన్నాడు. బంతిని అందుకున్న తర్వాత ఆ శునకం మైదానంలో పరుగెత్తుతూ వచ్చి.. శాస్త్రికి బంతిని అందించింది. శునకంతో క్యాచ్‌లు పట్టిస్తున్న వీడియోను రవిశాస్త్రి ట్విటర్లో షేర్‌ చేశాడు. అది కాస్త వైరల్ అయింది.

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు కోహ్లీసేన వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. సోమవారం వరకు అంతర్గత మ్యాచ్‌ ఆడిన భారత్‌ మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ దేహానికి దూరంగా వెళ్లే బంతులు, షార్ట్‌పిచ్‌ బంతులను ప్రత్యేకంగా సాధన చేశాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ సైతం చెమటోడ్చారు. ఇంగ్లండ్‌లో బంతులు స్వింగవుతాయని తెలిసిందే. వేగంగా వచ్చే బంతులను డ్రైవ్‌ చేయాలని భావిస్తుంటారు. ఆ క్రమంలో బంతులు బ్యాటు అంచులకు తగిలి స్లిప్‌లో లేదా వికెట్‌ కీపర్‌కు చిక్కుతుంటారు. అందుకే అలాంటి బంతులను భారత ఆటగాళ్లు సాధన చేశారు.

టీమిండియా అంతర్గత మ్యాచులో కుర్రాళ్లు అదరగొట్టారు. రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సత్తాచాటారు. నాలుగు రోజులు జరిగిన ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె జట్లు పోటీపడ్డాయి. పంత్‌ ఎప్పటిలాగే తన దూకుడు కొనసాగించాడు. 94 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 85 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా అజేయ అర్ధ శతకం బాదాడు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, హైదరాబాదీ గల్లీ బాయ్ మహ్మద్‌ సిరాజ్‌ వికెట్లు తీశారు. జూన్‌ 18న భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే.

భారత్-న్యూజిలాండ్‌ జట్లు ఇవే:
భారత జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానె(వైస్‌ కెప్టెన్), హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(కీపర్‌), సాహా(కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రిత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
కివీస్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్, డేవాన్‌ కాన్వే, కోలిన్‌ గ్రాండ్‌హోమ్‌, మాట్ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌.

Story first published: Tuesday, June 15, 2021, 22:01 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+