WTC Final: భారత్ X న్యూజిలాండ్ టైటిల్ ఫైట్‌కు వరుణ గండం! పిచ్ ఎవరికి అనుకూలం అంటే..?

WTC Final: The Southampton pitch is often a slower one | Oneindia Telugu

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ టైటిల్ పోరుకు తెరలేవనుంది. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మెగా ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కావడం.. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ టైటిల్ ఫైట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మెగా పోరుకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కోహ్లీసేన సిద్దమవుతుండగా.. ఇంగ్లండ్‌ గడ్డపై 22 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో కివీస్ బరిలోకి దిగనుంది.ఈ మెగా ఫైనల్‌కు సరిగ్గా ఐదు రోజుల ముందు ముగిసిన ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0తో గెలుచుకొని టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

బలంగా కివీస్..

బలంగా కివీస్..

తమ రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా.. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో కివీస్ ఈ అద్భుత విజయాన్నందుకోవడం ఆ జట్టు బలాన్ని తెలియజేస్తుంది. అయితే కివీస్ బలంగా ఉన్నప్పటికీ భారత జట్టును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. భారత జట్టులో కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లున్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే వీరులున్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఈ మెగా పోరులో కోహ్లీసేన కూడా హాట్ ఫేవరేటే. దాంతో ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా? అని ఫ్యాన్స్ ఎదురు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇరు జట్ల మధ్య ఉన్న రికార్డులు, పిచ్ రిపోర్ట్‌, వెదర్ రిపోర్ట్‌లు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే మైకేల్ తెలుగు పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్‌లను మీ ముందుకు తీసుకు వస్తుంది.

 పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

సౌతాంప్టన్ పిచ్ మాములుగానే నెమ్మదిగా ఉంటుంది. ఉపఖండ పిచ్‌ల స్వభావం కలిగి ఉంటుంది. 2014లో ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి వీలుంటుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పేస్‌, బౌన్స్‌, స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను రూపొందిస్తున్నట్లు పిచ్ క్యూరేటర్‌ సిమోన్‌ లీ ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు తెలిపారు.

‘రెండు జట్ల మధ్య పోటీ సమానంగా ఉండేలా పిచ్‌ను రూపొందిస్తాం. వికెట్‌లో కొంత వేగం, బౌన్స్‌ ఉండి బంతి క్యారీ అయ్యేలా తయారు చేస్తాం. సాధారణంగా ఇంగ్లండ్‌లో వాతావరణం అంతగా సహకరించదు. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. అందుకే వేగంతో కూడిన గట్టి పిచ్‌ను రూపొందిస్తాం. పిచ్‌ ముందుగా సీమర్ల బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకూ వీలుంటుంది. పిచ్‌పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం లభిస్తుంది.' అని సిమోన్‌ లీ చెప్పుకొచ్చాడు.

వర్ష గండం..

వర్ష గండం..

ఇక ఈ మెగా పోరుకు వర్ష గండం ఉంది. మ్యాచ్ ఒక రోజు ముందు అంటే జూన్ 17న సౌతాంప్టన్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో మైదానం చిత్తడిగా మారే చాన్స్ ఉంది. ఇక మ్యాచ్ ఫ్రారంభమైన తర్వాత తొలి రోజు, మూడో రోజు, నాలుగో రోజు చిరు జల్లులు పడనున్నాయి. అయితే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే జూన్ 23 రిజర్వ్ డే అయితే ఉంది. ఇక మ్యాచ్ జరిగే సమయంలో ఉష్ణోగ్రతలు పగిటి పూట 17-20 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, June 14, 2021, 14:31 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X