న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021: టీమిండియాకు భారీ షాక్.. స్పైడర్ పంత్, రహానే ఔట్! కష్టాల్లో కోహ్లీసేన!!

WTC Final 2021: Kyle Jamieson removes Rishabh Pant after Virat Kohli

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో కూరుకుపోతోంది. భారత్‌ కీలక ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లలో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించిన 'స్పైడర్' రిషబ్ పంత్ వికెట్‌ను కోహ్లీసేన కోల్పోయింది. కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ వేసిన 73 ఓవర్‌ నాలుగో బంతికి పంత్‌ (4) స్లిప్‌లో టామ్ లాథమ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంత్.. కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరడంతో ఫాన్స్ నిరాశకు గురయ్యారు.

మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులతో మూడో రోజు తొలి ఇన్సింగ్స్‌ ప్రారంభించిన భారత్.. మూడు పరుగులు మాత్రమే జోడించి కెప్టెన్ విరాట్ కోహ్లీ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ ముంగిట కోహ్లీ (132 బంతుల్లో 44) ఎల్బీగా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగు కూడా చేయకుండానే కైల్ జెమీసన్ అద్భుత బంతికి అతడు పెవిలియన్ చేరాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన కోహ్లీ.. కంగారు పడ్డాడు.

విరాట్ కోహ్లీ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా డిఫెన్స్‌ చేశాడు. తన శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. మరోవైపు అజింక్య రహానె మాత్రం సింగిల్స్ తీస్తూ.. కాస్త భారత స్కోరును కదిలించాడు. పంత్ ఓ ఫోర్ బాది గాడిలో పడ్డాడనుకున్నా.. అంతలోనే ఔట్ అయ్యాడు. జేమీసన్‌ వేసిన 73.4 ఓవర్‌కు పంత్ (4) స్లిప్‌లో లాథమ్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 156 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయింది. ఆపై రహానె కూడా పెవిలియన్ బాట పట్టాడు. వాగ్నర్ వేసిన 79వ ఓవర్ నాలుగో బంతికి రహానే (49) హాఫ్ సెంచరీ ముందు క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ 82 ఓవర్లలో 6 వికెట్లను 186 రన్స్ చేసింది. జడేజా, అశ్విన్ క్రీజులో ఉన్నారు.

Danish Aziz: ఒకే ఓవర్‌లో 33 పరుగులు..ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు!!Danish Aziz: ఒకే ఓవర్‌లో 33 పరుగులు..ప్లేఆఫ్‌ బెర్త్‌ ఖరారు!!

Story first published: Sunday, June 20, 2021, 17:04 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X