WTC Final 2021:ఉమ్మి రుద్దకున్నా..బంతి స్వింగ్ అవ్వగలదు!ఆ ఉద్దేశంతో కనిపిస్తేనే బౌలర్లు వెనకడుగు వేస్తారు!

సౌథాంప్టన్: ఉమ్మి రుద్దకున్నా ఇంగ్లండ్‌లో బంతి స్వింగ్ అవ్వగలదని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందన్నాడు. పరుగులు చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తేనే.. బౌలర్లు వెనకడుగు వేస్తారని యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఇంగ్లండ్‌లో పర్యటించేటప్పుడు మాత్రం చెత్త బంతుల్ని వదిలేయడం ఒక్కోసారి ముఖ్యమని గిల్ చెప్పాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న భారత్, న్యూజిలాండ్ జట్లు టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే.

ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్ అవ్వగలదు:
డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మీడియాతో మాట్లాడారు. 'ఇక్కడ ఉమ్మి రుద్దకున్నా బంతి స్వింగ్ అవ్వగలదు. అయితే జట్టు సభ్యుల్లో ఎవరో ఒకరు బంతి నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లండ్ వాతావరణం, పరిస్థితుల్లో బంతిని జాగ్రత్తగా పర్యవేక్షించడం అవసరం. అప్పుడే బౌలర్లు వికెట్లు తీయడం తేలికవుతుంది. ఇక లెంగ్త్‌లను సరిచూసుకోవడం కీలకం. నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. ఫైనల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని ఇషాంత్ శర్మ అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించడం తెలిసిందే.

భిన్నమైన సాధన అవసరం:
'ఇంగ్లండ్‌లో భిన్నమైన సాధన అవసరం. మార్పునకు త్వరగా అలవాటు పడాలి. భారత్‌లో కొంత సమయం తర్వాత రివర్స్ స్వింగ్ లభిస్తుంది. ఇంగ్లండ్‌లో స్వింగ్ ఉంటుంది కాబట్టి ఆ లెంగ్త్ ఫుల్లర్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడి లెంగ్త్‌లకు సర్దుకుపోవాలి. ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. ఇక క్వారంటైన్‌లో ఉండటం సవాల్‌గా మారింది. ఎందుకంటే జిమ్‌లో కసరత్తులు చేయడానికి మైదానంలో సాధన చేయడానికి ఎంతో తేడా ఉంటుంది' అని భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తెలిపాడు.

అప్పుడే బౌలర్లు వెనకడుగు వేస్తారు:
'గతంలో నేను భారత్-ఏ, అండర్-19 జట్ల తరఫున ఇంగ్లండ్‌లో ఆడాను. పరుగులు చేయాలంటే కొన్ని బంతుల్ని మాత్రమే ఎంచుకొని ఆడాలని చాలామంది అప్పుడు నాకు సూచించారు. నేనైతే పరుగులు చేయాలన్న తపనను ప్రదర్శిస్తేనే సక్సెస్ అవ్వగలం అని భావిస్తా. కేవలం క్రీజులో నిలబడితే చాలన్నట్టు కనిపించొద్దు. ఎందుకంటే మనం పరుగులు చేయాలన్న ఉద్దేశంతో కనిపిస్తేనే బౌలర్లు వెనకడుగు వేస్తారు. అప్పుడు వారిపై ఒత్తిడి పెట్టగలం. కొన్నిసార్లు ఇంగ్లండ్‌లో ఔటవ్వకుండా ఉండాలంటే మాత్రం చెత్త బంతులు వదిలేయాలి' అని శుభ్‌మన్ గిల్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications