న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final:మ్యాచ్ టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ వివరాలు.. ఫ్రీగా చూడాలంటే..

WTC Final 2021 India vs New Zealand Live Telecast In Star Sports 1 And Streaming In Disney Plus Hotstar
WTC Final Telecast: TV, Live Streaming Details | Disney+ Hotstar | Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మెగాపోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ కావడం.. ఫైనల్లో రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో ఈ మెగా పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్‌కు చేరి ఈ సూపర్ మ్యాచ్‌ కోసం సమాయత్తం అవుతున్నాయి. అయితే టీమిండియా ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగనుండగా.. మరోవైపు న్యూజిలాండ్ ఆతిథ్య ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఉత్సాహంలో ఉంది.

ఇది ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పైగా ఇంగ్లండ్ పరిస్థితులు వారి దేశంలోలానే ఉండటం అడ్వాంటేజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆ జట్టుపై భారీ అంచనాలు లేకపోవడం కూడా వారి పనిని సులువు చేస్తుందంటున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడా ప్రారంభమవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన షెడ్యూల్, టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్, స్టీమింగ్ వివరాలు తెలుసుకుందాం.

మ్యాచ్ టైమింగ్స్..

మ్యాచ్ టైమింగ్స్..

జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని ఏజీస్ బౌల్ మైదానం వేదికగా ఈ టైటిల్ పోరు జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌కు ఐసీసీ జూన్ 23ని రిజర్వ్‌డేగా కేటాయించింది. ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో కోల్పోయిన ఆటను చివరి రోజు ఆడించనున్నారు. అయితే దీనిపై ఐదో రోజు చివరి గంటలో మ్యాచ్ రిఫర్ నిర్ణయం తీసుకోనున్నాడు. ఆట అవసరమని భావిస్తేనే రిజర్వ్‌డేను ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఫలితం తేలని పరిస్థితిల్లో మ్యాచ్‌గా డ్రాగా పరిగణించి ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఇక భారత కాలమానం ప్రకారం సాయంత్ర 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

ఏ చానెల్‌లో వస్తుందంటే..?

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. స్టార్ నెట్‌వర్క్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు చానెల్స్‌లో కూడా మ్యాచ్‌‌ను వీక్షించవచ్చు. ప్రేక్షకులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సంబంధించిన ఆన్‌లైన వేదికల్లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. డీడీ(దూరదర్శన్) స్పోర్ట్స్ చానెల్‌లో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

డీస్నీ+హాట్ స్టార్‌లో కూడా రానుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లో మాత్రం స్కై స్పోర్ట్స్ చానెల్‌లో మ్యాచ్ రానుంది. సౌతాఫ్రికాలో కూడా ఈ మ్యాచ్ ప్రసారం కానుంది.

ఫ్రీగా చూడాలంటే..

ఫ్రీగా చూడాలంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను జియో టీవీ యాప్, ఎయిర్‌టెల్ టీవీ యాప్ ద్వారా ఫ్రీగా వీక్షించవచ్చు. స్మార్ట్ ఫోన్స్, లాప్ ట్యాప్స్, టాబ్లెట్ స్క్రీన్స్‌లో కూడా ఈ యాప్‌ల సాయంతో మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్..

హెడ్ టు హెడ్ రికార్డ్స్..

టెస్ట్ క్రికెట్‌లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు రికార్డులు గమనిస్తే కోహ్లీసేనదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 59 మ్యాచ్‌లు ఆడగా.. టీమిండియా 21 విజయాలు సాధించింది. న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల్లో గెలవగా 26 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆటగాళ్ల పరంగా భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్ కివీస్‌పై దుమ్మురేపాడు.

15 మ్యాచ్‌ల్లో 1659 రన్స్ చేశాడు. కివీస్ నుంచి బ్రెండన్ మెకల్లమ్‌కు మెరుగైన రికార్డు ఉంది. అతను 10 మ్యాచ్‌ల్లో 1224 రన్స్ చేశాడు. ఈ తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీకి మెరగైన రికార్డు ఉంది. అతను కివీస్‌పై ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 773 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌లో రాస్ టేలర్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. అతను 812 రన్స్ చేశాడు. అయితే గతేడాది ఆరంభంలో న్యూజిలాండ్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో భారత్ చిత్తుగా ఓడింది.

ఇరు జట్ల వివరాలు..

ఇరు జట్ల వివరాలు..

భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషభ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహా

న్యూజిలాండ్:

న్యూజిలాండ్:

కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డేవాన్ కాన్వే, జకోబ్ డఫ్పీ, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, బీజీ వాట్లింగ్(కీపర్), టాప్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, టామ్ బ్లండెల్, రాస్ టేలర్, బీజే వాట్లింగ్(కీపర్), టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, నీల్ వాగ్నర్, టీమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్, ఆజాజ్ పటేల్, డౌ బ్రేస్ వెల్, కైల్ జెమీసన్, విల్ యంగ్

Story first published: Thursday, June 17, 2021, 17:50 [IST]
Other articles published on Jun 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X