న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final 2021:న్యూజిలాండ్‌కు ఫీల్డ్ అంపైర్ సాయం.. కొద్దిలో విరాట్ కోహ్లీ వికెట్ మిస్ అయింది! లేదంటే?

WTC Final 2021: Field Umpire Richard Illingworth saves review for New Zealand

సౌథాంప్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ రెండో రోజు ఆట కూడా పూర్తిగా సాగలేదు. వర్షం కారణంగా తొలి రోజు టాస్‌ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌.. రెండో రోజు శనివారం వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ మధ్యలో నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత్‌ స్కోరు 64.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 124 బంతుల్లో 1x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (29; 79 బంతుల్లో 4x4) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కైల్ జేమీసన్‌, నీల్ వాగ్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా ఓ వికెట్‌ తీశారు.

క్యాచ్ ఔట్ కోసం అప్పీల్

క్యాచ్ ఔట్ కోసం అప్పీల్

అయితే ఫైనల్ మ్యాచ్‌కి విధులు నిర్వహిస్తున్న ఇంగ్లండ్ తటస్థ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ న్యూజిలాండ్‌కి సాయపడ్డాడు. శనివారం టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. బంతిని లెగ్ స్టంప్‌కి కాస్త దూరంగా విసిరాడు. ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ చేతుల్లోకి వెళ్లింది. బంతి బ్యాట్‌కి అతి సమీపంలో వెళ్లడంతో.. క్యాచ్ ఔట్ కోసం న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు.

విలియమ్సన్ రివ్యూ కోరకముందే

విలియమ్సన్ రివ్యూ కోరకముందే

ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ కివీస్ ఆటగాళ్ల అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో బౌల్ట్, కీపర్ వాట్లింగ్‌తో చర్చించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరేందుకు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అంపైర్ లింగ్‌వర్త్ తన అతితెలివితో కివీస్‌కు సాయం చేసేందుకు చూశాడు. విలియమ్సన్ రివ్యూ కోరకముందే.. తుది నిర్ణయం కోసం టీవీ అంపైర్‌ని అతడు ఆశ్రయించాడు. మైదానంలోని సౌండ్స్ కారణంగా తాను క్లియర్‌గా బ్యాట్ సౌండ్ వినలేకపోయానని టీవీ అంపైర్‌తో లింగ్‌వర్త్ చెప్పాడు. దాంతో విలియమ్సన్ రివ్యూ తీసుకునే అవకాశం లేకుండా అయింది. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి బ్యాట్‌కి దూరంగా వెళ్తున్నట్లు తేల్చి విరాట్ కోహ్లీని నాటౌట్‌గా ప్రకటించాడు.

WTC Final Day 2:వెలుతురు లేమితో ముగిసిన రెండో రోజు ఆట..భారత్ స్కోర్ 146/3! ఆధిపత్యం ఎవరిదంటే?

రివ్యూను సేవ్ చేశాడు

రివ్యూను సేవ్ చేశాడు

ఒకవేళ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డీఆర్‌ఎస్ కోరి ఉంటే.. అప్పుడు న్యూజిలాండ్‌కి రివ్యూ ఛాన్స్ మిస్ అయ్యేది. అంతకముందే ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్‌కి వెళ్లిన కివీస్.. ఒక రివ్యూ అవకాశాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ వారికి కీలక వికెట్ కావడంతో.. మరోసారి రిస్క్ తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లింగ్‌వర్త్ కివీస్‌కు ఓ రివ్యూను సేవ్ చేశాడు. ఆ సమీక్ష సమయంలో కాస్త టెన్షన్‌తో కనిపించిన కోహ్లీ.. రిప్లై రిలాక్స్ అయిపోయాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచుకు తటస్థ అంపైర్లు విధులు నిర్వహిస్తున్నారు.

WTC Final: Umpire Richard Illingworth Helps NZ | Virat Kohli Wicket ? || Oneindia Telugu
కోహ్లీ1

కోహ్లీ1

ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఓ అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్​లో టీమిండియాకు అత్యధిక మ్యాచ్​ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలయింది. ఇప్పటివరకు ధోనీతో సమానంగా 60 టెస్ట్​ల్లో భారత్​కు నాయకత్వం వహించాడు కోహ్లీ.

శనివారం సౌథాంప్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​తో కోహ్లీ.. 61వ టెస్ట్​లో టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మహీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. భారత్ తరఫున 60 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. అతడినే అధిగమించాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యధిక టెస్టులకి కెప్టెన్సీ వహించిన క్రికెటర్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (109) ఉన్నాడు.

Story first published: Sunday, June 20, 2021, 7:27 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X