WTC Final 2021: న్యూజిలాండ్ ప్లేయర్స్‌పై నోరు పారేసుకున్న ఫాన్స్.. చర్యలు తీసుకున్న ఐసీసీ!!

సౌథాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ కంటే టీమిండియాకే కాస్తోకూస్తో సపోర్ట్ ఉంది. మ్యాచ్‌కు వర్షం పదే పదే అడ్డుపడుతున్నా.. ప్రతి రోజూ ఇండియన్ ఫ్యాన్స్ స్టేడియానికి వచ్చి భారత జట్టుకు మద్దతుగా నిలిచారు. తమ ప్రేమాభిమానులతో కోహ్లీసేనను చీర్ చేస్తున్నారు. అయితే ఐదో రోజు ఆటలో మాత్రం కొందరు అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. న్యూజిలాండ్ ఆటగాళ్లపై నోరు పారేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సెక్యూరిటీ టీమ్ వెంటనే ఆ అభిమానులను బయటకు పంపించేసింది.

టేలర్‌ని ఉద్దేశిస్తూ:
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పరిమిత సంఖ్యలో అభిమానుల్ని స్టేడియంలోకి అధికారులు అనుమతించిన విషయం తెలిసిందే. ఐదవ రోజు (మంగళవారం) బ్యాటింగ్ చేస్తున్న కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్‌ని ఉద్దేశిస్తూ ఇద్దరు అభిమానులు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. టేలర్‌నే కాకుండా మరికొంతమంది ఆటగాళ్లను కూడా టార్గెట్ చేశారు. అయితే హద్దు మీరి ప్రవర్తించిన ఇద్దరినీ మ్యాచ్ అధికారులు స్టేడియం వెలుపలికి పంపించేశారు. ఈ విషయాన్ని ఆట ముగిసిన తర్వాత ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ఇలాంటివి సహించేది లేదు:
'న్యూజిలాండ్ ప్లేయర్స్‌పై నోరు పారేసుకున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మా సెక్యూరిటీ వెంటనే వాళ్లను గుర్తించి బయటకు పంపించేసింది. క్రికెట్‌లో ఇలాంటి తీరును సహించేది లేదు' అని ఐసీసీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఘటన గురించి న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని అడగ్గా.. నేనూ ఇప్పుడే దీని గురించి విన్నాను. ఫీల్డ్‌లో ఆటను మంచి స్పిరిట్‌తో ఆడాలి అని అన్నాడు.

ఇదేమీ తొలిసారి కాదు:
క్రికెటర్లపై అభిమానులు ఇలా స్టేడియంలో జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై అక్కడి అభిమానులు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. దాంతో ఫీల్డ్ అంపైర్లకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేయగా.. ఏడు మందిని స్టేడియం వెలుపలికి పంపించేశారు. ఐసీసీ ఈ జాత్యాహంకార వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే.

కఠినంగా ఈసీబీ:
ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి ఇటీవల అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్.. తాను టీనేజీలో ఉన్నప్పుడు చేసిన జాత్యాహంకార, జుగుప్సాకరమైన ట్వీట్‌లతో సస్పెన్షన్‌కి గురైన విషయం తెలిసిందే. 9 ఏళ్ల క్రితం రాబిన్సన్ చేసిన ట్వీట్లని నెటిజన్లు వెలుగులోకి తీసుకురావడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణకి ఆదేశించి సస్పెండ్ చేసింది. ఆపై ఇంగ్లీష్ ఆటగాళ్ల పాత ట్వీట్లపై కూడా విచారణ జరుపుతోంది. స్టార్ ఆటగాళ్లపై కూడా ఈసీబీ చర్యలు తీసుకోనుంది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications