Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021:పుజారా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు..నాన్-స్ట్రైకర్, బౌలర్,అంపైర్, ఫాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే?

WTC Final 2021: Cheteshwar Pujara Took 36 Balls for 1st run, Twitter trends hilarious memes on Him

సౌథాంప్ట‌న్‌: టీమిండియా న‌యా వాల్ చెటేశ్వ‌ర్ పుజారా ఆట టెస్టులకు పెట్టింది పేరు. క్రీజులోకి వచ్చాడంటే.. వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడాల్సిందే. అతడి వికెట్ కోసం బౌలర్లు శ్రమించాల్సిందే. సహచర ఆటగాళ్లతో కీలక బాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. టీమిండియాకు భారీ స్కోర్ అందిస్తాడు. ఈ క్రమంలో మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తాడు. ఈ మ‌ధ్య పుజారా ఆడుతున్న తీరు చాలా మందికి మింగుడు ప‌డ‌టం లేదు. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. సౌథాంప్ట‌న్‌ వేదికగాన్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్లోనూ అలానే ఆడుతున్నాడు.

తొలి ప‌రుగు కోసం 36 బంతులు:

శనివారం ఆరంభం అయిన డబ్ల్యూటీసీ ఫైన‌ల్లో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన అనంతరం చెటేశ్వ‌ర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారంతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. దాంతో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తో పాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. పుజారా త‌న తొలి ప‌రుగు చేయ‌డానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టిన పుజారా పరుగుల ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మ‌రో ఫోర్ కొట్టి.. చివ‌రికి 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

సెలైన్ ఎక్కించుకుని మరి:

డబ్ల్యూటీసీ ఫైన‌ల్లో చెటేశ్వ‌ర్ పుజారా ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కామెంట్లు, ఫ‌న్నీ మీమ్స్‌తో నెటిజ‌న్లు అతడిని ఓ ఆటాడుకుంటున్నారు. పుజారా బ్యాటింగ్ చేస్తున్నపుడు నాన్-స్ట్రైకర్, బౌలర్, అంపైర్, ఫాన్స్, తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌ రియాక్షన్స్ ఎలా ఉంటాయో మీమ్స్‌తో పోస్ట్ చేశారు. పుజారా బ్యాటింగ్ చేస్తున్నపుడు నాన్-స్ట్రైకర్, ఫాన్స్, తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్‌ తాపీగా పడుకుంటారట. బౌలర్ అయితే సెలైన్ ఎక్కించుకుని మరి బౌలింగ్ చేస్తాడట. ఇక అంపైర్‌కు సాలి పురుగులు పాకుతాయట. ఇలా ఫ‌న్నీ మీమ్స్‌తో నెటిజ‌న్లు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

విలువైన భాగస్వామ్యాలు:

ఇటీవలి కాలంలో భారత్ విజయాల్లో పుజారా కీలకంగా వ్యహరించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా వరుసగా రెండు సిరీసులు కైవసం చేసుకుందంటే.. పుజారా వల్లే. 2018-19 టూర్‌లో 74.43 సగటుతో 521 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఓ హాఫ్ సెంచరీ ఉంది. 2020-21 ఆసీస్ పర్యటనలో 33.88 యావరేజ్‌, మూడు హాఫ్ సెంచరీలతో 271 పరుగులు చేశాడు. గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో పుజారా అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌, మిడిలార్డర్‌లో రిషభ్ పంత్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బంతులు దేహానికి తగులుతున్నా గోడలా నిలబడ్డాడు.

స్ట్రైక్‌రేట్ ప్రధానం కాదు:

ఫైనల్ ముందు పుజారా స్ట్రైక్‌రేట్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. 'భారత్‌ కోసం పుజారా ఎంతో సాధించాడు. అందుకు పుజారాను ప్రశంసించాలి. టెస్ట్ ఫార్మాట్లో ప్రతిసారీ స్ట్రైక్‌రేట్ ప్రధానం కావు. టెస్టుల్లో విజయాలు అందుకోవాలంటే భిన్నమైన ఆటగాళ్లు, ప్రణాళికలు జట్టుకు అవసరం. చేతిలోని ఐదు వేళ్లలాగే ఇదీ. ప్రతి వేలికీ ఓక్కో పాత్ర ఉంటుంది. అదే విధంగా జట్టులో పుజారా అంతర్భాగం. అతడి ప్రతి ఇన్నింగ్స్‌నూ విశ్లేషించడం మానేసి.. దేశం కోసం సాధించినవాటికి మెచ్చుకోవాలి. పుజారా టెక్నిక్‌, రొటేషన్‌ గురించి నిత్యం ప్రశ్నించేవాళ్లు.. అతడిలా అత్యున్నత స్థాయి క్రికెట్‌ కనీసం ఆడి ఉండరు' అని సచిన్ అన్నారు.

Story first published: Sunday, June 20, 2021, 18:47 [IST]
Other articles published on Jun 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+