Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2021: ముగిసిన మూడో రోజు ఆట.. అదరగొట్టిన న్యూజిలాండ్‌! తేలిపోయిన భారత్‌!!

Bad light forces early Stumps on Day 3 after Ishant Sharma gets Devon Conway

సౌథాంప్టన్‌: భారత్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. మూడో రోజు (ఆదివారం) బంతి, బ్యాట్‌తో టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలలో రెండు వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను అరగంట ముందుగానే నిలిపివేశారు. ఓపెనర్లు టామ్‌ లాథమ్ ‌(30; 104 బంతుల్లో 3x4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6x4) రాణించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

బలమైన పునాది:
టీమిండియా తడబడిన సౌథాంప్టన్‌ పిచ్‌పై కివీస్ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వేలు అద్భుతంగా రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆచితూచి ఆడుతూ బ్యాటింగ్‌ చేశారు. కఠిన పరిస్థితుల్లో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వికెట్లు కాపాడుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు పంపించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి కివీస్‌కు బలమైన పునాది వేశారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆర్ అశ్విన్‌ విడదీశాడు. 34.2 ఓవర్‌కు ఊరించే బంతి వేయడంతో లాథమ్‌.. కోహ్లీ చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

వెలుతురు లేమి కారణంగా:
తర్వాత కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (12; 37 బంతుల్లో 1x4) తనదైన శైలిలో నిలకడగా ఆడి.. కాన్వేకు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే కాన్వే అర్ధ శతకం పూర్తిచేసున్నాడు. దీంతో మొదటి మూడు టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో 50+ స్కోర్లు చేసిన రెండవ కివీస్ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇషాంత్‌ వేసిన 49వ ఓవర్‌లో లెగ్‌ సైడ్‌ వెళ్లే బంతిని షాట్‌ ఆడబోయి షమీ చేతికి చిక్కాడు. దాంతో న్యూజిలాండ్‌ 49 ఓవర్లకు 101/2తో నిలిచింది. ఆపై రాస్ టేలర్ వచ్చి రెండు బంతులు ఆడాడు. అయితే అదే సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు.

మరో 71 పరుగులు చేసి:
అంతకుముందు భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా.. మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. మరో ఎండ్‌లో నీల్‌ వాగ్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కట్టుదిట్టంగా బంతులేశారు. తొలుత మైదానం తడిగా ఉండటంతో ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న జేమీసన్‌ బంతిని స్వింగ్‌ చేస్తూ కోహ్లీ, పంత్‌ (4)ను స్వల్ప వ్యవధిలో ఔట్‌చేశాడు. అనంతరం రహానే, జడేజా కాసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే పరుగుల వేగం పెంచే క్రమంలో రహానే అర్ధశత కానికి ఒక్క పరుగు దూరంలో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 182/6గా నమోదైంది.

తొలి ఇన్నింగ్స్‌కు తెర:
అనంతరం ఆర్ అశ్విన్‌ (22; 27 బంతుల్లో 3x4) ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 200 దాటాక సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దాంతో భారత్‌ 211/7 స్కోరుతో భోజన విరామానికి వెళ్లింది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఇషాంత్‌ (4), బుమ్రా (0), జడేజా (15) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌ ఐదు వికెట్లు తీయగా.. వాగ్నర్‌, బౌల్ట్‌ చెరో రెండు వికెట్లు తీశారు. సౌథీ ఒక వికెట్‌ దక్కింది.

Story first published: Sunday, June 20, 2021, 23:38 [IST]
Other articles published on Jun 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+