For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో పాకిస్తాన్ జైత్రయాత్ర: టీమిండియాను ఢీ కొడుతుందా?: ఆ ప్రతిష్ఠాత్మక ఫైనల్స్‌కు చేరువగా

WTC 2021-23 Points Table: Pakistan have a chance of finishing in the top 3 or maybe in the final

ఢాకా: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ జట్టు తన జైత్రయాత్రను సాగిస్తోంది. బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోన్న ఆ జట్టు.. రెండో టెస్ట్‌లోనూ ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో రెండు టెస్టులను గెలుచుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. భారత్ కంటే మెరుగైన పాయింట్లను తన ఖాతాలో వేసుకోగలిగింది.

రెండో టెస్ట్‌లో

రెండో టెస్ట్‌లో

ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్, ఎనిమిది పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్‌లో 205 పరుగులకు కుప్పకూలింది. రెండు ఇన్నింగులు కలిపి కూడా పాకిస్తాన్ తొలి ఇన్నింగ్‌లో చేసిన పరుగులను అందుకోలేకపోయింది బంగ్లాదేశ్ టీమ్. ఇన్నింగ్, 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ జట్టు 87 పరుగులే చేయగలిగింది. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. నాజ్ముల్ హొస్సేన్ శాంతో-30, షకీబుల్ హసన్-33 పరుగులతో తొలి ఇన్నింగ్‌లో రాణించగలిగారు.

సాజిద్‌కు ఎనిమిది వికెట్లు..

సాజిద్‌కు ఎనిమిది వికెట్లు..

తొలి ఇన్నింగ్‌లో పాకిస్తాన్ 300 పరుగులు చేసింది. నలుగురు బ్యాటర్ల హాఫ్ సెంచరీతో కదం తొక్కారు. బంగ్లాదేశ్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. అజర్ అలీ-56, కేప్టెన్ బాబర్ ఆజమ్-76, ఫవాద్ ఆలం-50, మహ్మద్ రిజ్వాన్-53 పరుగులు చేశారు. నాలుగు వికెట్ల నష్టానికి 300 పరుగుల వద్ద ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది పాకిస్తాన్. తొలి ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ 87 పరుగులకు ఆలౌట్ కావడం వల్ల ఫాలో ఆన్‌ను ఆడించింది. పాక్ బౌలర్ సాజిద్ ఖాన్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

ఫాలో ఆన్‌లోనూ

ఫాలో ఆన్‌లోనూ

ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు కొంత ఫర్వాలేదనిపించుకున్నారే తప్ప గెలిచేలా ఆడలేదు. ఓపెనర్లు షాద్మన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నాజ్ముల్ హొస్సేన్ శాంతో, మొమినుల్ హక్, తైజుల్ ఇస్లాం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. ముష్పికుర్ రెహ్మాన్-48, లిట్టన్ దాస్-45, షకీబుల్ హసన్-63 కొంత ప్రతిఘటించారు. ఓటమి ఆంతర్యాన్ని తగ్గించగలిగారే తప్ప రెండో ఇన్నింగ్‌లో కనీస ఆధిక్యాన్ని జట్టుకు అందించలేకపోయారు.

 డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో..

సాజిద్ ఖాన్ ఫాలో‌ఆన్‌లోనూ చెలరేగిపోయాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో 12 వికెట్లను పడగొట్టాడు. ఈ విజయంతో పాకిస్తాన్.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ 75.00. మొత్తం 36 పాయింట్లు పాకిస్తాన్ ఖాతాలో పడ్డాయి. నాలుగు టెస్ట్ మ్యాచ్‌లల్లో మూడు విజయాలు, ఒక పరాజయాన్ని పాకిస్తాన్ నమోదు చేసింది.

మూడో స్థానంలో భారత్..

మూడో స్థానంలో భారత్..

భారత జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. 42 పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ 58.33గా నమోదు చేసింది టీమిండియా. నాలుగు టెస్టుల్లో మూడు విజయాలు, ఒక అపజయాన్ని అందుకుంది. శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టుకు ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ 100.00. ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించడం వల్ల పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలవగలిగింది శ్రీలంక. ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, December 8, 2021, 18:36 [IST]
Other articles published on Dec 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+