Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20WC: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ ఘన విజయం.. అగ్రస్థానంలోకి!

ఉమెన్స్ వరల్డ్ కప్-2024‌లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. గ్రూప్-బీలో టాప్‌లోకి దూసుకెళ్లింది. షార్జా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఇది తొలి పరాజయం. తొలి మ్యాచ్‌‌లో సఫారీ సేన వెస్టిండీస్‌పై నెగ్గింది.

మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కెప్టెన్ లారా వోల్‌వార్డ్ (42; 39 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. మరిజాన్ కాప్ (26; 17 బంతుల్లో, 3 ఫోర్లు), డెర్క్‌సన్ (20 నాటౌట్; 11 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్‌ రెండు వికెట్లు, సారా గ్లెన్‌, చార్లీ డీన్‌, లిన్సె స్మిత్ తలో వికెట్ తీశారు.

WT20WC 2024 Spinners and Sciver-Brunt Lead England to Second Victory

ఓ దశలో సౌతాఫ్రికా 88/2తో మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి స్కోరుబోర్డును కట్టడిచేశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. నాట్‌ సీవర్‌ (48 నాటౌట్‌; 36 బంతుల్, 6 ఫోర్లు), డానీ వ్యాట్‌ (43; 43 బంతుల్లో, 4 ఫోర్లు) సత్తాచాటారు.కాప్‌, మ్లాబా, నదైన్‌ డీక్లెర్క్‌ తలో వికెట్ తీశారు.

WT20WC 2024 Spinners and Sciver-Brunt Lead England to Second Victory

ఛేదన ఆదిలోనే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులకే ఓపెనర్ బౌచియర్ (8) వెనుదిరిగింది. మరో ఓపెనర్ డానీ వ్యాట్ దక్షిణాఫ్రికాకు అవకాశం ఇవ్వకుండా క్యాప్సీ (19), నాట్ సీవర్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దింది. 18వ ఓవర్ వరకు క్రీజులో ఉండి లక్ష్యాన్ని కరిగించింంది. డానీ వ్యాట్ ఔటైన తర్వాత మిగిలిన పనిని నాట్ సీవర పూర్తిచేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్.. బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

Story first published: Tuesday, October 8, 2024, 9:01 [IST]
Other articles published on Oct 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+