Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీలకు గాయాల దెబ్బ: వన్డే సిరిస్ నుంచి డీకాక్ ఔట్

Wrist injury rules de Kock out of India series

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టులోని ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. మోచేతి గాయం కారణంగా సోమవారం ఆ జట్టు వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ వన్డే సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్ నుంచి కూడా తప్పుకున్నాడు. గాయాల కారణంగా ఇప్పటికే జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌తో పాటు కెప్టెన్ డుప్లెసిస్ దూరమైన సంగతి తెలిసిందే.

సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో డీకాక్ మణికట్టుకి గాయమైంది. ఈ గాయం నుంచి కోలుకునేందుకు రెండు లేదా నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో వన్డే సిరిస్‌తో పాటు టీ20 సిరిస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు.

India vs South Africa : How India Crush South Africa by 9 Wickets

'సెంచూరియన్ వేదికగా ఆదివారం రెండో వన్డేలో డీకాక్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీంతో అతడు తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యులు విశ్రాంతిని సూచించారు. అతడు కొలుకునేందుకు రెండు లేదా నాలుగు వారాల సమయం పడుతుంది' అని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మొహమ్మద్ మెసాజీ పేర్కొన్నాడు.

ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో డీకాక్ 20, 34 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో డర్బన్ వేదికగా మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టుకి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాగా, వన్డే సిరిస్‌కు ముందు దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే.

డర్బన్‌‌లో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ డుప్లెసిస్ గాయపడటంతో వన్డే సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కేప్ టౌన్ వేదికగా బుధవారం (ఫిబ్రవరి 7)న జరగనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, February 5, 2018, 17:14 [IST]
Other articles published on Feb 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+