Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పింక్ బాల్ టెస్ట్‌లో వృద్ధమాన్ సాహాకు గాయం: సర్జరీ విజయవంతం

IND vs BAN,2nd Test : Wriddhiman Saha Undergoes Successful Finger Surgery !
Wriddhiman Saha undergoes surgery for finger fracture sustained during Pink ball Test

హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సర్జరీ విజయవంతమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో వృద్దిమాన్ సాహా కుడి ఉంగరపు వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడమీలో సాహాకు పునరావాస ప్రక్రియ ప్రారంభమైందని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ మేరకు బీసీసీఐ "బీసీసీఐ మెడికల్ టీమ్ చేతి, మణికట్టు నిపుణుడిని సంప్రదించింది. చేతి వేలి పగులుకు ఆపరేషన్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. దీంతో మంగళవారం ముంబైలో సాహాకు చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సాహాకు పునరావాస ప్రక్రియ ప్రారంభమైంది" అని తెలిపింది.

బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-0తో క్లీవ్ స్వీప్ చేసింది. రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ సిరిస్‌లో సాహా ఓ వ్యక్తిగత రికార్డుని నెలకొల్పాడు. భారత్ తరుపున టెస్టుల్లో 100 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.

ఈ ఘనత సాధించిన ఐదో భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. సాహా వంద డిస్మిల్స్‌లో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి. డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మన్ షాద్‌మన్‌ను ఔట్ చేయడం ద్వారా భారత్‌ తరుఫున టెస్టుల్లో 100 ఔట్లలో భాగస్వామ్యమైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో ధోని(294) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సయ్యద్ కిర్మాణీ(198), కిరణ్‌ మోరే(130), నయాన్‌ మోంగియా(107) వరుసగా ఉన్నారు. సాహా గాయాలు పాలవడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సాహా గాయాల బారిన పడ్డాడు. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సాహా మోచేతికి గాయమవడంతో సిరిస్ నుంచి అర్ధాంతరంగా భారత్‌కు తిరిగొచ్చాడు.

Story first published: Wednesday, November 27, 2019, 14:48 [IST]
Other articles published on Nov 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+