Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాహా భుజానికి ఆపరేషన్ చేయాల్సిందే: ఆసీస్ పర్యటనకు అనుమానమే!

Wriddhiman Saha to undergo shoulder surgery after bungled recovery at NCA

హైదరాబాద్: టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా ఆగస్టులో లండన్‌ వెళ్లి భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. దీంతో సాహా ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌తో పాటు నవంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరం కానున్నాడు.

సాహా గాయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ "సాహా ఆగస్టులో లండన్‌ వెళ్లి తన భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. అనంతరం భారత్‌ తిరిగొచ్చాక బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో సాహా కోలుకునేందుకు ఫిజియో సాయం చేస్తాడు" అని అన్నాడు.

రెండు నెలల పాటు బ్యాట్‌ పట్టుకోకూడదు

రెండు నెలల పాటు బ్యాట్‌ పట్టుకోకూడదు

"ఆపరేషన్ అనంతరం సాహా సుమారు రెండు నెలల పాటు బ్యాట్‌ పట్టుకోకూడదు. అప్పుడే అతను పూర్తిగా కోలుకోగలడు. దీంతో అతడు నవంబరులో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే దానిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి" అని అతడు చెప్పుకొచ్చాడు.

భుజం గాయం కారణంగా భారత్‌కు తిరిగొచ్చిన సాహా

భుజం గాయం కారణంగా భారత్‌కు తిరిగొచ్చిన సాహా

"ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ జరిగే సమయంలో భుజం గాయం కారణంగా సాహా తిరిగి ఇండియా వచ్చేశాడు. ఆ తర్వాత కోలుకుని ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ సమయంలో సాహా చేతి వేలికి గాయంతో ఐపీఎల్ లీగ్‌కే పూర్తిగా దూరమయ్యాడు" అని తెలిపాడు.

 భుజం గాయంతో బాధపడుతోన్న సాహా

భుజం గాయంతో బాధపడుతోన్న సాహా

"కానీ, ఇప్పుడు సాహా చేతి వేలి గాయం కంటే ఎక్కువగా భుజం గాయంతో బాధపడుతున్నాడు. దీని నుంచి కోలుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు" అని బీసీసీఐ అధికారి తెలిపాడు. మరోవైపు సాహా ట్విటర్‌ ద్వారా తన గాయంపై అభిమానులతో పంచుకున్నాడు.

ప్రస్తుతం అత్యంత చెత్త దశను ఎదుర్కొంటున్నా

"అవును. వృద్ధి ఆరోగ్యంగా లేడు. అందుకే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. నా క్రికెట్‌ కెరీర్‌లో ప్రస్తుతం అత్యంత చెత్త దశను ఎదుర్కొంటున్నాను. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. గాయమవ్వడం మన చేతిలో లేదు. నా క్రికెట్‌ భవిష్యత్తు గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాకండి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించండి. దేశం తరఫున ఆడుతోన్న ఆటగాళ్లకు మద్దతుగా నిలవండి" అని ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, July 19, 2018, 16:55 [IST]
Other articles published on Jul 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+