Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాగదీస్తూనేఉండు: సాహా 35వ పుట్టినరోజు నాడు బీసీసీఐ ట్విట్టర్‌లో వినూత్నంగా!

Wriddhiman Saha turns 35: India cricketers, fans greet wicketkeeper-batsman on his birthday

హైదరాబాద్: టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా గురువారం 35వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సహచర క్రికెటర్లతోపాటు అభిమానులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భుజం గాయం కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సాహా ఇటీవలే దక్షిణాఫ్రికా సిరిస్‌తో మళ్లీ టెస్టు అరంగేట్రం చేశాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సాహా అద్భుత ప్రదర్శన చేశాడు. సాహా పుట్టినరోజు సందర్భంగా బీసీసీఐ తన ట్విట్టర్‌లో అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. "హ్యాపీ బర్త్‌డే సాహా - సాగదీస్తూనేఉండు - క్యాచ్‌లు బాగా పట్టుకో" అంటూ నెట్స్‌లో సాహా ప్రాక్టీస్ చేస్తోన్న ఫోటోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

కాగా, భారత్ తరుపున ఇప్పటివరకు 35 టెస్టులాడిన సాహా 1209 పరుగులు చేయడంతో పాటు 86 క్యాచ్‌లు పట్టి 11 స్టంపింగ్స్ చేశాడు. టెస్టుల్లో సాహా అత్యధిక స్కోరు 117. ఇక, వన్డేల విషయానికి వస్తే కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడాడు. వన్డేల్లో 17క్యాచ్‌లు పట్టి ఒక స్టంపింగ్ చేశాడు. సాహాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మయాంక్ అగర్వాల్, మనోజ్ తివారీలు ఉన్నారు.

Story first published: Thursday, October 24, 2019, 12:54 [IST]
Other articles published on Oct 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+