For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను సెలెక్ట్ కానని నాకు ముందే చెప్పారు కదా.. ఇంకెందుకు ఆశిస్తా.. సాహా సంచలన కామెంట్లు

Wriddhiman saha says ‘I dont think I will be selected, because the coach, selector had informed me’

ఐపీఎల్ 2022 దినేష్ కార్తీక్‌కు కొత్త జీవితాన్ని అందించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విజయవంతంగా రాణించిన డీకే తన మార్క్ ఫినిషింగ్ ఆటతో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. ఇక ఈ సిరీస్లో కటక్‌లో 30నాటౌట్, రాజ్‌కోట్‌‌లో 55పరుగులతో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు.

ప్లేయింగ్ XIలో నంబర్ 6వ స్థానానికి న్యాయం చేయగల ప్లేయర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. దినేష్ కార్తీక్ ఫామ్ ప్రస్తుతం భారత క్రికెట్‌ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అనేక మంది మాజీ క్రికెటర్లు అతను టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానానికి అర్హుడు అంటూ అతన్ని సెలెక్ట్ చేయాల్సిందేనంటూ పేర్కొంటున్నారు.

ఇకపోతే ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేసినందుకు కార్తీక్‌కు భారత జట్టు ఎంట్రీ దొరికినప్పటికీ మరో వెటరన్ క్రికెటర్ ఐపీఎల్లో సత్తా చాటినా అతనికి మాత్రం మొండిచేయి తప్పలేదు. అతనెవరో కాదు గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాహా కూడా గుజరాత్ టైటాన్స్‌ తరఫున సత్తా చాటాడు. సాహా 11 మ్యాచ్‌లలో 317పరుగులు సాధించాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే సాహా తిరిగి టీమిండియా టెస్టు జట్టుకు ఎంపిక కాలేదు. అంతర్జాతీయంగా పునరాగమనం చేసేలా కన్పించిన సాహాను సెలెక్షన్ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఇటీవల సాహా మాట్లాడుతూ.. 'ఇప్పటికే కోచ్, చీఫ్ సెలెక్టర్ నాకు తెలియజేసినందున (నేను టీమిండియాకు సెలక్ట్ కాను అనే విషయం) నేను ఇక మళ్లీ ఈ విషయం గురించి ఇంకా ఆలోచించాలని అనుకోను. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటే.. తప్పకుండా నా ఐపీఎల్ ప్రదర్శన తర్వాత.. నేను ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టులో ఎంపికయ్యేవాడిని.. ప్రస్తుతం నన్ను ఎంపిక చేయకపోవడంతో పాటు చాలా మందిని పక్కనపెట్టడంతో నాకు నేనిక సెలెక్ట్ కానని స్పష్టం అయింది. కానీ నా కోసం, నేను క్రికెట్ ఆడటంపై దృష్టి సారిస్తాను.

నా క్రికెట్‌ను ఇష్టపడేంత వరకు నేను ఏ తరహా క్రికెట్ (ఐపీఎల్, ఇతరాలు) ఆడతాను' అని సాహా స్పోర్ట్స్ టాక్ ది‌లో తెలిపాడు. ఇకపోతే ఐపీఎల్ 2022 సాహాకు రెండో విజయవంతమైన ఐపీఎల్ సీజన్ అని చెప్పవచ్చు. అతను 2014లో పంజాబ్ కింగ్స్ తరపున 362పరుగులు సాధించాడు.
'ఓవరాల్‌గా నేను నా జట్టుకు అవసరమైనంత మేర సహకారం అందించాను. మేము ఐపీఎల్ 2022 ఛాంపియన్‌లుగా మారాము. దీనికి ముందు 2014లో నేను కింగ్స్ ఎలెవన్ (పంజాబ్ కింగ్స్) కోసం ఫైనల్‌లో సెంచరీ చేశాను. ఇకపోతే ఏదీ బెస్ట్ అంటే ఐపీఎల్ 2022నే బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ పరుగుల పరంగా నేను 2014లో ఎక్కువ స్కోర్ చేశాను, అలాగే ఎక్కువ మ్యాచ్‌లు కూడా ఆడాను' అని సాహా పేర్కొన్నాడు.

Story first published: Monday, June 20, 2022, 16:02 [IST]
Other articles published on Jun 20, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+