Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇద్దరికీ మాత్రమే డే/నైట్ క్రికెట్ అనుభవం: సహచర క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తారా?

Wriddhiman Saha ready to help India teammates prepare for day-night Test vs Bangladesh


హైదరాబాద్:
తన డే/నైట్ టెస్టు అనుభవాన్ని జట్టులోని సహచర క్రికెటర్లతో పంచుకునేందుకు సిద్ధమని టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. నవంబర్‌ 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆట మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల నుంచి ప్రారంభం కానుంది. డే/నైట్ టెస్టును అభిమానులకు మరింత చేరువ చేసేందుకు టికెట్ల ధరను కనిష్టంగా రూ.50గా క్యాబ్ నిర్ణయించింది. టీమిండియాకు ఇదే తొలి డే/నైట్ టెస్టు కావడం విశేషం.

ప్రస్తుతం కోహ్లీసేనలో కేవలం ఇద్దరికి మాత్రమే డే/నైట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సూపర్ లీగ్‌లో భాగంగా 2016లో ఈడెన్ గార్డెన్స్‌లో మహ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహాలు డే/నైట్ క్రికెట్ ఆడారు. మూడేళ్ల తర్వాత అదే స్టేడియంలో భారత జట్టు డే-నైట్ టెస్ట్ ఆడుతోంది.

సహచర క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తారా?

సహచర క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తారా?

ఈ నేపథ్యంలో జట్టులోని సహచర క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తారా? అన్న ప్రశ్నకు సాహా "నిజం చెప్పాలంటే, నాకు నిజంగా అవేమీ గుర్తులేవు. షమీ నిజంగా వేగంగా బౌలింగ్ చేశాడు మేము (మోహన్ బాగన్) గెలిచాము. నాకు గుర్తున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే కొన్నిసార్లు బంతిని తీయడం కష్టమవుతుంది" అని చెప్పాడు.

ఏడు వికెట్లు తీసిన షమీ

ఏడు వికెట్లు తీసిన షమీ

మోహున్ బాగన్-భువానిపూర్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ మొత్తం ఏడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన షమీ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను కలిగి ఉంది.

భారత్‌, బంగ్లాదేశ్‌ తప్ప

భారత్‌, బంగ్లాదేశ్‌ తప్ప

భారత్‌, బంగ్లాదేశ్‌ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్‌ టెస్టులు ఆడాయి. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్‌ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌‌లో గతేడాది ప్రయోగాత్మకంగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు.

పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే

పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే

అయితే, పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో బీసీసీఐ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌ను డే/నైట్‌లో ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

సాహా మాట్లాడుతూ

సాహా మాట్లాడుతూ

దీనిపై సాహా మాట్లాడుతూ "మేము ఆడవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గతంలో ఆడాయి. ఇతర దేశాలు ఉన్నాయి, కాబట్టి.. ఇది జనాన్ని ఆకర్షించడానికి జరిగింది, ఆటకు కూడా మంచిది" అని అన్నాడు. డే/నైట్ టెస్టులో కోహ్లీసేన ఫ్లడ్ లైట్ల కింద ఆడటం ఇదే మొదటిసారి. దీనిపై సాహా తన అనుభవాన్ని జట్టుతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు.

డే/నైట్ టెస్టు కొత్త సవాలే

డే/నైట్ టెస్టు కొత్త సవాలే

"ఇది ఒక కొత్త సవాల్‌గా నిలుస్తుంది. ఇప్పటివరకు మేము పింక్ బంతితో టెస్టులు ఆడలేదు. నేను దేశవాళీ పింక్ బాల్ మల్టీ-డే గేమ్‌లో మాత్రం ఆడాను. ప్రతి క్రీడలో ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఒక జట్టుగా మీరు ఎంత ఎక్కువ సవాలు చేయబడతాతో మీరు మరింత మెరుగవుతారు. మేము అలా చేస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా" అని సాహా అన్నాడు.

Story first published: Wednesday, October 30, 2019, 19:03 [IST]
Other articles published on Oct 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+