Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భిన్నంగా ఉంటుంది: కుంబ్లే హాస్యంపై కీపర్ సాహా

కోల్‌కత్తా: భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా స్పష్టం చేశాడు. ఈ నెల 9న నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కు బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల బృందంలో వృద్థిమాన్ సాహా ఎంపికైన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న నేపథ్యంలో గురువారం వృద్థిమాన్ సాహా మీడియాతో మాట్లాడాడు. తన రంజీ జట్టు బెంగాల్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎంతో మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నాడు.

బెంగాల్ జట్టుకు ఆడుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సీరియనస్ వాతావరణం ఉంటుందని తెలిపాడు. సీరియస్ తరహా వాతావరణం తనకు నచ్చేది కాదని సాహా తెలిపాడు. అయితే టీమిండియా డ్రస్సింగ్ రూమ్‌లో వాతావరణం అందుకు భిన్నంగా ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నాడు.

ఇక టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేలతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలపై సాహా ప్రశంసలు కురిపించాడు. కుంబ్లే ఎల్లప్పుడూ సూచనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాటని తెలిపాడు. కుంబ్లేకి హాస్య చతురత ఎక్కువని దాని వల్ల డ్రస్సింగ్ రూమ్‌లో చక్కటి వాతావరణం ఉంటుందని పేర్కొన్నాడు.

Wriddhiman Saha lauds dressing room atmosphere in Indian Test team

ఇక కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే రెండు సిరిస్‌లు నెగ్గిందని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌కి తన స్టయిల్ అంటూ ఉంటుందని, దాని ప్రకారమే క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని ప్రయత్నిస్తుంటాడని చెప్పాడు.

తాను బ్యాటింగ్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ బంతులను ఆడేందుకే ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇక కెప్టెన్ల విషయానికి వస్తే ధోని, కోహ్లీలలో ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరిక అమితంగా ఉంటుందని తెలిపాడు. దానికోసం తమ శాయశక్తులా పోరాడతారని అన్నాడు.

కోహ్లీ, ధోని కెప్టెన్సీ విషయాల్లో పెద్దగా తేడా లేకపోయినా, కొన్ని విషయాల్లో మాత్రం ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందని తెలిపాడు. మైదానంలో ధోని కూల్‌గా ఉంటే, కోహ్లీ మాత్రం కాస్తంత దూకుడుగా ఉంటాడని పేర్కొన్నాడు.

మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లి చాలా ఫ్రెండ్లీగా ఉండాడని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరితో చాలా సన్నిహితంగా కలిసిపోయే వ్యక్తిత్వం కోహ్లిదని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ కూల్‌గా మాట్లాడుతూ సూచనలు చేస్తూ తన అనుభవాన్ని మాతో పంచుకుంటాడని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+