సాహానే నెంబర్ వన్: 'కీపర్‌గా అతడికే మా ఓటు'
హైదరాబాద్: టీమిండియా టెస్టు జట్టుకు కీపర్‌గా ఎంపికయ్యే వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌లో నెంబర్ వన్ చాయిస్ వృద్ధిమాన్ సాహాయేనని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. గాయంతో జట్టుకు దూరమైన సాహా ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటడం, ఫిట్‌నెస్ నిరూపించుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నాడు.
దీంతో రాబోయ్ సీరిస్‌ల్లో భారత టెస్టు జట్టులో సాహాకు చోటు దక్కనుందని ఎమ్మెస్కే పరోక్షంగా సంకేతాలిచ్చాడు. మంగళవారం ముగిసిన ఇరాన్ కప్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సాహా డబుల్ సెంచరీ సాధించి రెస్టాఫ్ ఇండియాను గెలిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఇరాన్ కప్‌లో సాహాను ఆడిండం ఫిట్‌నెస్ పరీక్ష కోసమే కానీ అతడి ఫామ్‌ను గురించి కాదని ఎమ్మెస్కే అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో సాహాకు గాయం కావడంతో అతడి స్థానంలో రంజీల్లో గుజరాత్ కెప్టెన్ పార్థివ్ పటేల్ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతానికి సాహా, పార్దీవ్‌లు భారత్ నంబర్ 1, 2 కీపర్లని చెప్పాడు.

పార్ధీవ్ కంటే సాహానే మెరుగు
పార్ధీవ్ కీపింగ్ నాణ్యత పెరిగిందని, అయితే సాహాది అతడికంటే మెరుగ్గా ఉందని కితాబిచ్చాడు. ‘ఎవరైనా గాయం తర్వాత జట్టులోకి రావాల్సి వస్తే దేశవాళీ మ్యాచ్ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని ముందే స్పష్టం చేశాం. ఇందుకోసం సాహాకు మంచి అవకాశం దక్కింది. ఫిట్‌నెస్‌ను పరీక్షించడం కోసమే సాహాను ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడించాం. రెస్ట్ జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ వికెట్‌కీపర్ల జాబితాలో సాహా, పార్థివ్ తొలి రెండు స్థానాల్లో నిలుస్తారు' అని ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

మిడిల్ఆర్డర్ ఎంతో బలపడింది
ఇంగ్లాండ్‌తో ముగిసిన వన్డే సిరిస్ అనంతరం టీమిండియా మిడిల్ఆర్డర్ ఎంతో బలపడిందని అన్నాడు. ముఖ్యంగా ధోని, యువరాజ్ సింగ్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. అయితే 2019 వరల్డ్‌కప్ వరకు వారు జట్టులో ఉంటారా? అనేది ఇంత ముందుగా చెప్పలేనన్నాడు.

యువీతో పాటు జాదవ్ రాణించడం
యువీ, కేదార్ లాంటి వాళ్ల ఎంపిక మేలు చేసిందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా మిడిలార్డర్‌పై కొంత ఆందోళన నెలకొనడంతో యువీకి అవకాశం కల్పించామని చెప్పాడు. కేదార్ జాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. 2014-15 సీజన్ క్వార్టర్స్‌లో ఆంధ్ర Vs మహారాష్ట్ర మ్యాచ్ సందర్భంగా అతడి ఆటను చూశానని అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీకి రిహార్సిల్‌లా ఉంది
40 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న మహారాష్ట్రను అతడు ఒంటి చేత్తో గెలిపించాడు. అందుకే కేదార్‌కు అవకాశం దక్కిందని చెప్పిన ఎమ్మెస్కే న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా మిడిలార్డర్ బలహీనంగా ఉందని, జూన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మిడిలార్డర్ బలపడటం శుభసూచకమని చెప్పాడు.

రోహిత్ శర్మ వస్తే అంతా సర్దుకుంటుంది
ఇక ఓపెనింగ్ విషయానికి వస్తే గాయం నుంచి కోలుకుని రోహిత్ శర్మ జట్టులోకి వస్తే అంతా సర్దుకుంటుందని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications