Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఎక్కువ సమయం అవసరం లేదు.. నెల రోజుల్లో పునరాగమనం చేస్తా'

Wriddhiman Saha expects recovery in five weeks after finger surgery

కోల్‌కతా: గాయం మరీ పెద్దదేమీ కాదు. కోలుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. నెల రోజుల్లో జట్టులో పునరాగమనం చేస్తానని టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆశాభావం వ్యక్తం చేసాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో సాహా కుడి చేతి వేలికి గాయం అయింది. ఉంగరపు వేలిలోని ఎముకలో చీలిక వచ్చిందని గుర్తించిన బీసీసీఐ వైద్యులు సాహాకు ముంబైలో శస్త్రచికిత్స చేయించింది.

నెల రోజుల్లో పునరాగమనం చేస్తా:

నెల రోజుల్లో పునరాగమనం చేస్తా:

తాజాగా సాహా తన గాయంపై మాట్లాడుతూ... 'నాకైన గాయం మరీ పెద్దదేమీ కాదు. సాధారణ చీలికే. ముంబైలో శస్త్రచికిత్స పూర్తయింది. గాయం నుండి కోలుకోవడానికి ఐదు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఇంటివద్ద కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటా. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్తా. నెల రోజుల్లో జట్టులో పునరాగమనం చేస్తా' అని తెలిపాడు.

 గతంలో మోచేయికి గాయం:

గతంలో మోచేయికి గాయం:

ఐపీఎల్‌ 2019 సీజన్‌ తర్వాత సాహా మోచేయికి గాయం అయింది. బీసీసీఐ లండన్‌లో శస్త్రచికిత్స చేయించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంతో చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. దేశవాళీలో ఆడి సత్తా చాటాడు. ఇదే సమయంలో పంత్ విఫలమవడంతో.. బంగ్లా సిరీస్‌లో ఆడి మళ్లీ గాయపడ్డాడు.

భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు:

భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు:

టీమిండియా తర్వాతి టెస్టు సిరీస్‌ ఫిబ్రవరిలో ఉంది. న్యూజిలాండ్‌ పర్యటన నాటికి సాహా కోలుకుంటాడు. వచ్చే నెలలో విండీస్‌తో భారత్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నప్పటికీ.. అందులో టెస్టు సిరీస్‌ మాత్రం లేదు. విండీస్‌ పర్యటనలో కేవలం టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ మాత్రమే ఉంది. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే వరకూ భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేవు.

సంధ్య వెలుగులో బంతి కనిపించడం కష్టం:

సంధ్య వెలుగులో బంతి కనిపించడం కష్టం:

పింక్ బాల్ టెస్టులో సంధ్య వెలుగులో బంతి కనిపించడం కష్టమని సాహా అన్నాడు. 'ఫ్లడ్‌లైట్లు, సంధ్య వెలుగులో బంతి కనిపించడం కచ్చితంగా సవాలే. మంచు పరిస్థితులు కూడా ఉన్నాయి. బౌండరీ సరిహద్దు వద్ద ఉన్న ఫీల్డర్లకు బంతి సరిగ్గా కనిపించదు. అయితే వేసవిలో మ్యాచ్‌ నిర్వహిస్తే.. ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. సైట్‌స్క్రీన్ ఇంకా ప్రభావవంతంగా ఉంటే బంతి బాగా కనిపించేది. సాధారణ ఎస్‌జీ బంతికన్నా గులాబి ఇంకాస్త ఎక్కువ స్వింగ్‌ అయింది. అప్పడప్పుడు గులాబి మ్యాచులు నిర్వహిస్తేనే బాగుంటుంది' అని సాహా పేర్కొన్నాడు.

Story first published: Thursday, November 28, 2019, 15:53 [IST]
Other articles published on Nov 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+