Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ఓటమి పాలయ్యాం: యూపీ వారియర్స్ కెప్టెన్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి పాలైనప్పటికీ.. యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం ఆమె తన జట్టు ప్రదర్శన, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 10 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమిపై స్పందిస్తూ కెప్టెన్ మెగ్ లానింగ్ సానుకూల దృక్పథంతో మాట్లాడారు.

గుజరాత్ బ్యాటింగ్‌పై ప్రశంసలు
"ఇది చాలా మంచి గేమ్. మేము గెలుపుతో ఈ సీజన్‌ను ప్రారంభించాలని అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు అత్యద్భుతంగా ఆడారు. వారు మా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది, అందుకే బౌలర్లకు ఇది సవాల్‌గా మారింది" అని లానింగ్ పేర్కొన్నారు.

WPL 2026 UP Warriors Captain Meg Lanning After Defeat to Gujarat Giants

మా ప్లాన్స్‌ను అమలు చేయడంలో కొన్ని చోట్ల తడబడ్డామని లానింగ్ అంగీకరించారు. "మేము అనుకున్న విధంగా బౌలింగ్‌ను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. వికెట్‌కు రెండు వైపులా పరుగులు ఇచ్చేశాం. అయితే మా బౌలింగ్ విభాగంలో అందరికీ ఎప్పుడైనా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉంది, అది మా బలం. సోఫీ ఎక్లెస్టోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. ఆమె తన గేమ్ ప్లాన్‌ను చక్కగా అమలు చేస్తుంది. గతంలో ఆమెకు ప్రత్యర్థిగా ఆడాను, ఇప్పుడు ఆమెతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది" అని ఆమె వెల్లడించారు.

ముందుకు సాగడమే లక్ష్యం
తొలి మ్యాచ్ ముగియడంతో తమపై ఉన్న ఒత్తిడి తగ్గిందని, ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకున్న విషయాలను తదుపరి మ్యాచ్‌లో అమలు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. "ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉంటాయి. తదుపరి మ్యాచ్‌కు ముందు మాకు కొంచెం సమయం ఉంది. ఈ తప్పులను సరిదిద్దుకుని, కొత్త సవాళ్లను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాం" అని యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ ముగించారు.

Story first published: Saturday, January 10, 2026, 18:56 [IST]
Other articles published on Jan 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+