Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: నేటి నుంచే టికెట్ల వేట.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండిలా!

WPL 2025: మహిళా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ షెడ్యూల్ ఖరారైంది. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న నేపథ్యంలో ఈసారి డబ్ల్యూపీఎల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్.. ఫిబ్రవరి 5న జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ముందు ముగియనుంది.

టికెట్ల అమ్మకం ఎప్పుడు? ఎక్కడ?
బీసీసీఐ ఈ సీజన్ కోసం అధికారిక టికెటింగ్ పార్ట్నర్‌గా డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రకటించింది. నేడు (డిసెంబర్ 26) సాయంత్రం 6 గంటల నుంచి ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు మొదలవుతాయి. డబ్ల్యూపీఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా జొమాటో (Zomato) కు చెందిన 'డిస్ట్రిక్ట్ యాప్' డౌన్‌లోడ్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

WPL 2026 Tickets Go on Sale Today How to Book Online Schedule and Match Details

తొలి పోరు ఎవరెవరి మధ్య?
ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే పాత ప్రత్యర్థులు తలపడబోతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జనవరి 9న తొలి మ్యాచ్ జరగనుంది.

వేదికలు, షెడ్యూల్
డబ్ల్యూపీఎల్ 2026 రెండు దశల్లో, రెండు వేదికలపై జరగనుంది.

మొదటి దశ (నవీ ముంబై): డీవై పాటిల్ స్టేడియంలో జనవరి 9 నుంచి 17 వరకు మొత్తం 11 మ్యాచ్‌లు జరుగుతాయి.

రెండో దశ (వడోదర): వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో మిగిలిన 11 మ్యాచ్‌లతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

జట్లు, కెప్టెన్లు:
*ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్)

*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్)

*ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ (కొత్త కెప్టెన్)

*యూపీ వారియర్స్: దీప్తి శర్మ (వేలంలో రికార్డు ధర రూ. 3.2 కోట్లు)

*గుజరాత్ జెయింట్స్

గత విజేతలు:
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ రెండుసార్లు ట్రోఫీని గెలుచుకోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి టైటిల్ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌గానే నిలిచింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, యూపీ, గుజరాత్ జట్లు పట్టుదలతో ఉన్నాయి.

Story first published: Friday, December 26, 2025, 17:39 [IST]
Other articles published on Dec 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+