Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీ సుందరి అందానికి ఫిదా.. ఒక్క మ్యాచ్‌తోనే ఓవర్‌నైట్ సెలబ్రిటీ!

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేసిన ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్.. మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ బౌలర్ కేవలం 24 గంటల్లోనే ఓ పెద్ద మైలురాయిని చేరుకుంది.

ఇన్‌స్టాలో 10 లక్షల మంది ఫాలోవర్లు
లారెన్ బెల్ తన ఆటతీరుతో, తన లుక్స్‌తో భారతీయ క్రికెట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. దీని ఫలితంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య వేగంగా పెరిగి మిలియన్(10లక్షల) మార్కును దాటింది. ఈ అరుదైన ఘనతపై లారెన్ బెల్ స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "ఇక్కడ 10 లక్షల మంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను!" అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

WPL 2026 RCB Star Lauren Bell Becomes Overnight Sensation After One Match

తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లారెన్ బెల్ తన బౌలింగ్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేసింది. ఆమె 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఆర్సీబీ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ప్రదర్శన తర్వాతే సోషల్ మీడియాలో ఆమె కోసం వెతికే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

రూ. 90 లక్షల ధర.. ఆర్సీబీకి డబుల్ బెనిఫిట్
గత సీజన్‌లో యూపీ వారియర్స్ జట్టులో ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల లారెన్ బెల్ దూరమైంది. అయితే డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ యాజమాన్యం ఆమెను 90 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. లారెన్ బెల్ రాకతో ఆర్సీబీకి కేవలం బౌలింగ్ విభాగంలోనే కాకుండా, గ్లోబల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా పెద్ద ప్లస్ పాయింట్ లభించినట్లయింది.

Story first published: Sunday, January 11, 2026, 10:59 [IST]
Other articles published on Jan 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+