Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టైటిల్ వేట మొదలు: ఆర్సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే!

WPL 2026: మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన రెండో టైటిల్‌పై కన్నేసింది. ఈ మెగా ఈవెంట్ జనవరి 9న ప్రారంభం కానుండగా.. ఆర్సీబీ తన తొలి పోరులోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

రెండో టైటిల్ వేటలో ఆర్సీబీ
మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆర్సీబీ తన ప్రయాణాన్ని నవీ ముంబైలో ప్రారంభించి.. వడోదరలో లీగ్ దశను ముగించనుంది. ఈసారి స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరం కావడం ఆర్సీబీకి పెద్ద లోటు. ఆమె స్థానంలో సాయలీ సత్ఘరే జట్టులోకి వచ్చింది.

WPL 2026 RCB Begin Second Title Hunt Full Schedule and Squad Details

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) షెడ్యూల్:
*జనవరి 9 (శుక్రవారం) -ముంబై ఇండియన్స్ vs ఆర్సీబీ -నవీ ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు..
*జనవరి 12 (సోమవారం)-ఆర్సీబీ vs యూపీ వారియర్స్- నవీ ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు
*జనవరి 16 (శుక్రవారం)- ఆర్సీబీ vs గుజరాత్ జెయింట్స్- నవీ ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు
*జనవరి 17 (శనివారం)-ఢిల్లీ క్యాపిటల్స్ vs ఆర్సీబీ- నవీ ముంబై వేదికగా రాత్రి 7:30 గంటలకు
*జనవరి 19 (సోమవారం)-గుజరాత్ జెయింట్స్ vs ఆర్సీబీ-వడోదర వేదికగా రాత్రి 7:30 గంటలకు
*జనవరి 24 (శనివారం) -ఆర్సీబీ vs ఢిల్లీ క్యాపిటల్స్- వడోదర వేదికగా రాత్రి 7:30 గంటలకు
జనవరి 26 (సోమవారం) -ఆర్సీబీ vs ముంబై ఇండియన్స్- వడోదర వేదికగా రాత్రి 7:30 గంటలకు
జనవరి 29 (గురువారం)- యూపీ వారియర్స్ vs ఆర్సీబీ- వడోదర వేదికగా రాత్రి 7:30 గంటలకు

డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఆర్సీబీ పూర్తి జట్టు:
స్మృతి మంధాన (కెప్టెన్), రిచా ఘోష్, సాయలీ సత్ఘరే (ఎల్లీస్ పెర్రీ స్థానంలో), శ్రేయంక పాటిల్, జార్జియా వోల్, నాడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, దయాలన్ హేమలత, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, ప్రత్యూష కుమార్.

Story first published: Sunday, January 4, 2026, 16:37 [IST]
Other articles published on Jan 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+