Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీకి బిగ్ షాక్.. గెలుపు జోష్‌లో ఉండగానే స్టార్ ప్లేయర్ ఔట్!

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలన విజయం నమోదు చేసినప్పటికీ.. ఆ జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టుకు చెందిన కీలక ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది.

ఏం జరిగిందంటే?
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పూజా వస్త్రాకర్ హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ఆమె ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అంటే ఆమె ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లకు దూరం కానుంది.

WPL 2026 Big Blow for RCB as Star All-rounder Pooja Vastrakar Ruled Out Due to Injury

వేలంలో భారీ ధర.. ముంబై నుంచి ఆర్సీబీకి!
పూజా వస్త్రాకర్ గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. ముంబై ఆమెను రూ. 1.90 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, ఈసారి వేలంలో ఆర్సీబీ ఆమెను రూ.85 లక్షలకు సొంతం చేసుకుంది. ముంబైపై మ్యాచ్‌లో తన పాత జట్టుపై సత్తా చాటాలని భావించిన పూజా, ఇప్పుడు గాయంతో తప్పుకోవాల్సి రావడం ఆర్‌సీబీకి పెద్ద లోటే.

పూజా వస్త్రాకర్ కెరీర్ గణాంకాలు:
పూజా వస్త్రాకర్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించే 'ఎక్స్ ఫ్యాక్టర్' ప్లేయర్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కెరీర్లో ఆమె 16 మ్యాచ్‌ల్లో 126 రన్స్ చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టింది. టీమ్ ఇండియా తరఫున 5 టెస్టులు (15 వికెట్లు), 33 వన్డేలు (27 వికెట్లు), 72 టీ20లు (58 వికెట్లు) పడగొట్టింది. వన్డేల్లో ఆమెకు 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

Story first published: Saturday, January 10, 2026, 12:23 [IST]
Other articles published on Jan 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+