For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ.. ఎవరీ ఆల్‌రౌండర్?

WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ సరికొత్త తారలను వెలుగులోకి తెస్తోంది. శనివారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగిన అనుష్క శర్మ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించింది. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పేరు కలిసి రావడంతో సోషల్ మీడియాలో ఈ యువ క్రికెటర్ పేరు ఇప్పుడు మారుపోగిపోతోంది.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ అనుష్క శర్మ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 22 ఏళ్ల అనుష్క శర్మ కెప్టెన్ ఆష్లే గార్డనర్‌తో కలిసి మూడో వికెట్‌కు కేవలం 63 బంతుల్లోనే 103 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఆడుతూ, అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తీరు క్రికెట్ విశ్లేషకులను ఆకట్టుకుంది.

WPL 2026 Anushka Sharma Shines on Debut for Gujarat Giants Who Is the Star All-rounder

అత్యంత ఖరీదైన 'అన్‌క్యాప్డ్' ప్లేయర్
డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలంలో అనుష్క శర్మ హాట్ టాపిక్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 45 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ వేలంలో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ (భారత జట్టుకు ఆడని) క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆమె చూపిన నిలకడైన ప్రదర్శనే ఈ గుర్తింపు తెచ్చిపెట్టింది.

అనుష్క శర్మ క్రికెట్ కెరీర్ హైలైట్స్:
అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ సత్తా చాటింది.డొమెస్టిక్ వన్డేల్లో ఆమెకు 63 అత్యుత్తమ బ్యాటింగ్ యావరేజ్ ఉంది.మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్ల తరఫున ఆడిన అనుభవం ఆమెకు ఉంది.

Story first published: Saturday, January 10, 2026, 17:36 [IST]
Other articles published on Jan 10, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+