Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం!!

డబ్ల్యూపీఎల్‌-2025 సీజన్‌ ఆరంభానికి ముందు ఆర్సీబీ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డివైన్ ఈ కొత్త సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలిసింది. సీజన్‌ లోని అన్ని మ్యాచ్ లకు ఆమె దూరం కానున్నట్లు సమాచారం అందింది.

ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ తెలిపింది.సోఫీ కొంతకాలం పాటు డొమాస్టిక్ క్రికెట్ కు దూరం అవ్వనున్నట్లు పేర్కొంది. అయితే సోఫీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో స్పష్టత ఇవ్వలేదు. "ఆటగాళ్ల శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్, అలాగే మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేమంతా భావిస్తున్నాం. సోఫీకి ఇప్పుడు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. దీంతో ఆమె ప్రొఫెషనల్ క్రికెట్ కు ఫిట్ గా తిరిగొస్తుంది." అని న్యూజిలాండ్ స్టేట్ మెంట్ లో వెల్లడించింది.

WPL 2025 RCB s allrounder Sophie Devine to miss third season

ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ
సోఫీ తీసుకున్న తాజా నిర్ణయం ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బే. ఆమె గతేడాది డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ ను ఆర్సీబీ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 2024 డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన డివైన్‌.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు తీసింది. దీంతో ఆమెను బెంగళూరు జట్టు ఈ ఏడాది సీజన్ కోసం రిటైన్‌ చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌ మూడో సీజన్‌ ఫిబ్రవరి 14 నుంచి మొదలు కానుంది. తొలి మ్యాచ్‌ బరోడా వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌ - డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ మధ్య జరగనుంది.

Story first published: Saturday, January 25, 2025, 18:03 [IST]
Other articles published on Jan 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+