Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2025: ఓటమి బాధ - వెక్కి వెక్కి ఏడ్చిన దిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్!(వీడియో వైరల్)

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌ (డబ్ల్యూపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా జరిగిన ఫైనల్ మ్యాచులో ముంబై ఇండియన్స్‌పై 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓటమి తెప్పలేదు.

మైదానంలోనే ఏడ్చేసిన..
వరుసగా మూడోసారి ఫైనల్ కు చేరిన దిల్లీ క్యాపిటల్స్ ఓట‌మి చెందడంతో ఆ జట్టు ప్లేయర్ కాప్ భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ అయిపోయక ఆమె స్టేడియంలోనే క‌న్నీళ్లు పెట్టుకుంది. దీంతో స‌హ‌చ‌రులు ఆమెను ఓదర్చారు. కాప్ తో పాటు కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా కంటిత‌డి పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన క్రికెట్ అభిమానులు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మద్దతుగా నిలుస్తూ ఓదారుస్తున్నారు. మీరు ఓడినా కూడా మా మనసులు గెలిచారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులు) టాప్‌ స్కోరర్‌ గా నిలిచింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 30) పర్వాలేదనిపించింది.

పోరాడినా ఫలితం దక్కలే..
ఆ తర్వాత లక్ష్యఛేదనలో దిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఓపెన‌ర్లు లానింగ్‌(13), షెఫాలీ వ‌ర్మ‌(4) త్వరగా పెవిలియన్ చేరడంతో మంచి శుభారంభం దక్కలేదు. ఆ స‌మ‌యంలో రోడ్రిగ్స్‌(30) కాసేపు క్రీజులో నిలిచి పర్వాలేదనిపించింది.

అయితే ఓ దశలో 67 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్లిన ఢిల్లీని ఆల్‌రౌండ‌ర్ మరిజాన్‌ కాప్ ఆదుకుంది. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై విరుచుకుపడింది. ఢిల్లీని విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకువెళ్లింది. దీంతో ఢిల్లీ విజయం పక్కా అని అంతా భావించారు. కానీ ఆమె 18 ఓవ‌ర్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయిపోయింది. మ్యాచ్ ముంబై వైపు మలుపు తిరిగింది. మొత్తంగా కాప్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 ప‌రుగులు చేసింది. అంత‌కుముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంది.

WPL 2025 Marizanne kapp cries after Delhi capitals loss against mumbai indians in final
Photo Credit: twitter screenshot
Story first published: Sunday, March 16, 2025, 10:01 [IST]
Other articles published on Mar 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+