Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి సెలబ్రేషన్స్.. RCBని అవమానించిన RR..మీమ్స్ వైరల్

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీగా ఉంటుంది. ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించకపోయినా.. ఈ సాలా కప్ నమదే అంటూ ఆర్సీబీని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే మొత్తంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ 17 ఏళ్ల కల నెరవేరింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది.

ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైన‌ల్‌లో ఆర్సీబీ ఉమెన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ప్లేయర్లందరూ అమితానందంలో మునిగిపోయారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌కు వీడియో కాల్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

WPL 2024 Virat Kohli Celebrations RCB Memes Viral Video

అయితే ఉమెన్స్ టీమ్ ట్రోఫీ సాధించారని, ఇక ఆర్సీబీ మెన్స్ టీమ్ కప్ కలను తీర్చాలని నెట్టింట్లో పోస్ట్‌లు మొదలయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేయడం గమనార్హం. మీ కంటే ఉమెన్స్ టీమ్ స్ట్రాంగ్ అంటూ అర్థం వచ్చేలా రాజస్థాన్ రాయల్స్ ట్విటర్‌లో మీమ్ పోస్ట్ చేసింది. అలాగే కోహ్లి-స్మృతి మంధాన గురించి కూడా ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ ఫ్యాన్స్ మీమ్స్ కౌంటర్ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా, ఆర్సీబీ కప్ గెలవడంతో ఆదివారం రాత్రి బెంగళూరులో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు చేసుకున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది.

Story first published: Monday, March 18, 2024, 11:48 [IST]
Other articles published on Mar 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+