ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. ట్రోఫీని అందుకోవాలనే 16 ఏళ్ల ఆర్సీబీ ఫ్రాంచైజీ కలను అమ్మాయిలు నెరవేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఒత్తిడిని జయించి విజేతగా నిలిచారు. ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన తుదిపోరులో ఆర్సీబీ ఉమెన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.

అయితే మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విజయాన్ని ఆస్వాదించారు. కాగా, కెప్టెన్ స్మృతి మంధాన తన ప్రియుడి పలాష్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడు పలాష్ ముచ్చల్. బాలీవుడ్ ఫ్యాన్స్‌కు పలాష్ సుపరిచితమే. మ్యూజిక్ డైరక్టర్‌గా రాణిస్తున్నాడు. డిష్కియావూన్ సినిమాతో అరంగేట్రం చేశాడు. అయితే ఓ ఈవెంట్‌లో పలాష్-స్మృతి మంధానకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. ఒకరినొకరు అభినందించుకుంటూ సోషల్ మీడియాలో వారిద్దరు తరుచూ పోస్ట్‌లు పెడుతుంటారు.
తాజాగా ట్రోఫీతో స్మృతితో కలిసి దిగిన ఫొటోను పలాష్ ముచ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'ఈ సాలా కప్ నమ్దూ..ఆర్సీబీ' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దానికి స్మృతి మంధాన కూడా బదులిచ్చింది. బ్లాక్ హార్ట్ లవ్ సింబల్స్‌తో స్మృతి కామెంట్ పెట్టింది. అయితే ప్రేమలో ఉన్నట్లు వారిద్దరు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ వాళ్ల సన్నిహితులు కన్ఫార్మ్ చేశారు.