Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన RCB

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. ఎట్టకేలకు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అబ్బాయిలకు అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ అమ్మాయిలు సాధించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఛాంపియన్‌గా బెంగళూరు నిలిచింది. ట్రోఫీని అందుకోవాలనే 17 ఏళ్ల ఆర్సీబీ ఫ్రాంచైజీ కల నెరవేరింది. ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైన‌ల్‌లో ఆర్సీబీ ఉమెన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అయితే విజేతగా నిలిచిన అనంతరం తమ మహిళా జట్టు విన్నింగ్ ఫొటోను ఆర్సీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. క్వీన్స్ 2024‌ బోర్డుపై ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ట్రోఫీతో కలిసి ఫోజు ఇచ్చిన ఫొటో అది. 'ఈ జట్టుకు భారీ విజయం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే పోస్ట్ చేసిన తొమ్మిది నిమిషాల్లోనే పది లక్షల లైక్స్ వచ్చాయి.

WPL 2024 RCB created history

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ లైక్స్ సాధించిన ఓ ఇండియన్ ఎకౌంట్ పోస్ట్‌గా ఆర్సీబీ విన్నింగ్ పోస్ట్ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి చేసిన పోస్ట్‌కు పది నిమిషాల్లోనే పది లక్షల లైక్స్ వచ్చాయి. మూడో స్థానంలో ఎల్విష్ యాదవ్ ఉన్నాడు. ఈ జాబితాలో టాప్-7లో అయిదు స్థానాలు కోహ్లివే.

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాంక పాటిల్ (4/12) ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (44; 27 బంతుల్లో) టాప్ స్కోరర్.అయితే ఓ దశలో 64/0తో ఢిల్లీ మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత 49 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. షెఫాలీ వర్మతో పాటు మెగ్ లానింగ్ (23; 23 బంతుల్లో) నిలకడగా ఆడటంతో పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. కాగా, సోఫీ మొలినెక్స్ వేసిన 8వ ఓవర్‌‌తో ఢిల్లీ కథ మారిపోయింది.

114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎలీస్ పెర్రీ (35*; 37 బంతుల్లో), సోఫీ డివైన్ (32; 27 బంతుల్లో), స్మృతి మంధాన (31; 39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రిచా ఘోష్ (17*; 14 బంతుల్లో) సత్తాచాటింది.

Story first published: Monday, March 18, 2024, 10:56 [IST]
Other articles published on Mar 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+